Home తాజా వార్తలు బ్యాంకులకు ఆరు రోజుల వరుస సెలవుల్లేవ్!

బ్యాంకులకు ఆరు రోజుల వరుస సెలవుల్లేవ్!

Banks So Many Crores Loss with Debt Defaults

హైదరాబాద్: బ్యాంకులకు వరసగా ఆరు రోజులు సెలవులు ఉన్నాయని, బ్యాంకుల్లో  పని ఉంటే  ఇవాళ, రేపు పని పూర్తి చేస్తుకోండని  సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. నిజంగానే ఆరు రోజులు బ్యాంకులు మూతపడుతున్నాయనే సందేహం కలగక మానదు. ఎందుకంటే సెప్టెంబర్-2న ఆదివారం, సెప్టెంబర్ 3న కృష్టాష్టమి, 4, 5 తేదీలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు, 8వ తారీఖున రెండో శనివారం, 9వ తేదీన ఆదివారం కావునా మొత్తం ఆరు రోజులు సెలవులు రానున్నాయి. కానీ జాతీయ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే…. ఈ వార్తల్లో నిజం లేదని రిజర్వ్ బ్యాంకు ఉద్యోగులు మాత్రమే సమ్మెకు దిగుతున్నారని, కానీ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం రన్ అవుతుందని వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.  తెలుగు రాష్ట్రాలో మాత్రం సోమవారం సెలవు ప్రకటించాయి. ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లో సోమవారం బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు.  వరుస సెలువులు వస్తే నగదుకు కొరత ఏర్పడుతుందేమోనని ప్రజలు ఆందోళనకు గురువుతారని. దీంతో బ్యాంకులకు వరుస సెలవులు లేవన్నారు.