Home జాతీయ వార్తలు సత్తా చాటాం

సత్తా చాటాం

సర్జికల్ దాడులను ఏ ఒక్క దేశమూ ప్రశ్నించలేదు : అమెరికాలో ప్రధాని మోడీ

Modi

వాషింగ్టన్: పాకిస్థాన్ నేలపై ఉన్న తీవ్రవాద శిబిరాలపై భారత దేశం జరిపిన వ్యూహాత్మక దాడులను (సర్జికల్ స్ట్రయిక్స్) ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సమర్థించుకున్నారు. దాడులతో భారత్ తన సత్తా చాటిందని.. వీటిని ప్రపంచంలోని ఏ ఒక్క దేశ మూ ప్రశ్నించలేదని ఆయన అన్నారు. దాడుల ద్వారా తీవ్రవా దాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తన చర్యను ప్రపంచానికి సమర్థవంతంగా సర్ది చెప్పగలిగిందని ఆయన చెప్పారు. ‘20 ఏళ్ల కిందట తీవ్రవాదం గురించి మనం మాట్లాడినపుడు ప్రపంచం లోని చాలా మంది అది శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య, మీకర్థం కాదన్నారు. కానీ, ఇపుడు తీవ్రవాదమంటే ఏమిటో తీవ్ర వాదులు అలాంటి వారికి వివరించారు. దాని గురించి మనమి పుడు వారికి వివరించాల్సిన పనిలేదు’ అని ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోన్న భయంకరమైన తీవ్రవాద దాడులను ఉద్దేశించి ఆయన అన్నారు. వర్జీనియాలో ఆయన కోసం ఏర్పాటు చేసిన రిసె ప్షన్‌లో పాల్గొన్న సుమారు 600 మంది ఇండో-అమెరికన్లను శించి మోడీ ప్రసంగించారు. గతేడాది సెప్టెంబరు 29న పాక్ ఆక్ర మిత కశ్మీర్ (పిఒకె)లోని తీవ్రవాద శిక్షణా శిబిరాలపై భారత సైన్యం వ్యూహాత్మక దాడులు చేయడం ద్వారా అవసరమైతే భారత దేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోగలదని, భద్రతకు భరోసా కల్పించగలదన్న సంగతిని నిరూపించిందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో ఉన్న భారత సైనిక స్థావరంపై పాక్ తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా భారత్ వ్యూహాత్మక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘భారత్ సర్జికల్ దాడులు చేసినపుడు యావత్ ప్రపంచం మన బలమేంటో గ్రహించింది. అవసరమొచ్చినపుడు తీవ్రవాదాన్ని అణచడంలో నూ, స్వీయరక్షణలోనూ భారత్ తన శక్తిని ప్రదర్శిస్తుందని కూడా అందరికీ అర్థమయింది’ అని మోడీ చెప్పారు. మరోవైపు తమ మూడేళ్ల పాలనలో అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వంపై కనీసం ఒక్క మచ్చ కూడా లేదని ఆయన అన్నారు. గతంలో భారతదేశం లోని ప్రభుత్వాలు అధికారం కోల్పోవడానికి అవినీతే ప్రధాన కార ణమని పరోక్షంగా గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారతీయులకు అవినీతి అంటే గిట్టదని, వారు దానిని అసహ్యించు కుంటారని ఆయన అన్నారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమెరికాలోని భారతీయులకు ఆయన హామీ ఇచ్చారు. టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతను సాధిస్తున్నామని, భారతదేశంలోని అన్ని రంగాల అభివృద్ధికి దానిని ఉపయోగిస్తున్నామని మోడీ చెప్పారు.
యుఎస్ బిజినెస్ స్కూళ్లలో జిఎస్‌టి పాఠాలు
జులై 1 నుండి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయనున్న వస్తు-సేవల పన్ను (గూడ్స్‌అండ్ సర్వీసెస్ టాక్స్-జిఎస్‌టి) చట్టం అమలు విధానం అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో పాఠ్యాంశమవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో అమెరికాలోని 20 మంది ప్రముఖ కంపెనీల సిఇఒలతో ప్రధాని మాట్లాడారు. కొన్నేళ్ల కృషి తర్వాత జిఎస్‌టి అమలుకానుందని ఆయన చెప్పారు. ఈ చట్టం అమలు సంక్లిష్టమైనదని ఆయన అన్నారు. అయితే భవిష్యత్ సమగ్ర అధ్యయనాలకు ఇది మూల వస్తువు కాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.