Home జాతీయ వార్తలు ఉపాధిపై ఉపేక్ష వద్దు

ఉపాధిపై ఉపేక్ష వద్దు

సాకులతో నిధులు ఆపొద్దు

ఆహార భద్రతా చట్టాన్ని అమలుచేయండి
ఉపాధి హామీ పథకం చెల్లింపుల జాప్యానికి పరిహారమివ్వండి, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయండి : కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు

supreme-courtన్యూఢిల్లీ: ఆర్థిక వనరులు లేవనే సాకు చెప్పవద్దని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంఎన్‌ఇఆర్‌ఇ జిఎ) పరిధిలో కేంద్రం రాష్ట్రాలకు అవసరమైన, అందించాల్సి ఉన్న నిధులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. కరువు ప్రాంతాలలో  రైతుకూలీల భత్యాలలో జాప్యానికి తగు పరిహారం చెల్లించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టంలోని నిబంధనలను ప్రస్తుత పరిస్థితు లలో కేంద్రం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంద ని న్యాయమూర్తులు ఎంబి లోకూర్, ఎన్‌వి రమణ తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరువు ప్రాంతా లలో బాధితులను     ఆదుకునే బాధ్యత ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప టిష్టం చేయాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. కరువు ప్రాంతాలలో పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వం కేంద్రీయ ఉపాధి హామీ మండలిని ఏ ర్పాటు చేయాల్సి ఉంది. రాజ్యాంగంలో దీని ఏర్పాటుకు ప్రత్యేకంగా నిర్ధేశిం చారు. ఈ విధమైన ఏర్పాటు వల్ల పంట నష్టం జరిగిన ప్రాంతాలలో తగు పరి హారం అందేందుకు వీలేర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. కరువు పరిస్థితు ల మధ్య కేంద్రం తగు విధంగా వ్యవహరించాల్సి ఉందని సుప్రీంకోర్టు చురక లు అంటిస్తూనే ఇదే సమయంలో రాష్ట్రాలు తమ బాధ్యతనుంచి తప్పించుకు నేందుకు వీల్లేదని, పార్లమెంట్ రూపొందించిన చట్టాలతో సంబంధం లేదన్న ట్లుగా రాష్ట్రాలు వ్యవహరించడానికి వీల్లేదు. చట్టపరమైన పాలనకు రాష్ట్రాలతో పాటు అందరి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల లోనూ కరువు ప్రాంతాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం కల్పించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో అత్యధిక ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థి తులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతను సవాలు చే స్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం తీవ్రంగా స్పందించింది. స్వచ్ఛంద సేవా సంస్థ ‘స్వరాజ్ అభియాన్’ వారు కరువుపై కేంద్రం చర్యలు సరిగ్గా లేవని పేర్కొంటూ , న్యాయస్థానం జోక్యానికి పిటిషన్ దాఖలు చేశారు. కరువు పరిస్థితుల నివారణలో ఉన్న మానవీయ కోణాన్ని విస్మరించరాదని త మ బాధ్యత కాదంటే తమ బాధ్యత కాదని కేంద్రం, రాష్ట్రాలు పరస్పర ఆరోప ణలతో కాలాయాపన చేస్తే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కరువు నివారణకు దేశంలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై సుప్రీంకోర్టు పలు మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. అయితే తాము జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వాలు ఏ మేరకు అమలు చేస్తున్నాయనేది పర్యవేక్షించేందుకు కోర్టు పరంగా కమిషనర్లను చేయడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది. అయితే దీని పై ఆగస్టు 1న జరిగే విచారణ సందర్భంగా పరిశీలిస్తామని తెలిపారు. దేశంలో కరువు పరిస్థితులపై సుప్రీంకోర్టు మూడు భాగాల తీర్పును సిద్ధం చేసింది. ఇందులో తొలి భాగాన్ని 11న వెలువరించారు. ఇప్పుడు మరో భాగాన్ని ప్రకటించారు. కరువు విషయంలో రాష్ట్రాలు ఉష్ట్రపక్షి ధోరణితో వ్యవహరిస్తే దీనిని సాకుగా చేసుకుని కేంద్రం చేతులు దులుపేసుకునేందుకు వీల్లేదని తీర్పు తొలి భాగంలో సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అంతేకాకుండా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కరువుపై తగు విధంగా స్పందించనట్లు నిర్థారణ అయితే అనివార్యంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవల్సి ఉంటుందని, అయితే దీనిపై లక్ష్మణ రేఖ అవసరం అని కూడా పేర్కొంది. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో దేశంలోని కరువు పరిస్థితులపై తగు విధంగా చర్చలు జరగలేదని, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని విమర్శలు వెలువడుతున్న తరుణంలోనే అత్యున్నత న్యాయస్థానం ఈ తీవ్ర అంశంపై సమగ్ర రీతిలో స్పందించడం కీలకంగా మారింది.
కరువును సకాలంలో గుర్తించడంలో గుజరాత్, హర్యానా , బీహార్ వంటి రాష్ట్రాలు ఉదాసీనత వహించాయని, దీనితో ఇప్పుడు సంక్షోభ నివారణ చర్యలకు బదులు సంక్షోభ సర్దుబాటుకు ఇప్పుడు చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరువు పరిస్థితుల నివారణకు జాతీయ పథకం రూపొందించడం కానీ, జాతీయ విపత్తు నివారణ నిధిని ఏర్పాటు చేయడం కానీ ఇప్పటికీ జరగకపోవడం శోచనీయం అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. విపత్తుల నిర్వహణ చట్టం అమలులోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇందులో నిర్థేశించిన విధంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం బాధ్యతరాహిత్యాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. దేశంలో నాలుగింట ఒకవంతు ప్రజలు కరువు కోరల్లో చిక్కితే ఇది జాతీయ విపత్తు కాక మరేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా వంటి 12 రాష్ట్రాలలో తీవ్ర కరువు ఉందని , అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని పిటిషనర్ సుప్రీం దృష్టికి తెచ్చారు.