Saturday, April 20, 2024

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్లు పనిచేయవనే ఆధారాలు లేవు

- Advertisement -
- Advertisement -
no evidence that vaccines work on omicron
పార్లమెంటులో కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని చెప్పే ఆధారాలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. వైరస్ కొమ్ము జన్యువు (స్పైక్ జీన్)లో కొన్ని ఉత్పరివర్తనలు ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్ధాన్ని తగ్గిస్తాయనే ప్రచారం జరుగుతున్నా దీనిపై నిపుణుల అభిప్రాయాలతో పూర్తి సమాచారం అందుబాటులో లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభకు తెలియచేశారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా అన్న ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. యాంటీబాడీలు, కణాల్లోని జ్ఞాపకశక్తి ఆధారంగా కూడా వ్యాక్సిన్ల రక్షణ లభిస్తుంది. తీవ్ర వ్యాధి బారిన పడకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. అందుబాటులో ఉన్న వాటితో టీకాలు ఇవ్వడం కీలకం అని చెప్పారు.
‘దేశ వ్యతిరేకి’ నిర్వచనం మొదట్లో చట్టాల్లో లేదు

దేశ వ్యతిరేకి (యాంటీ నేషనల్ ) అనే పదానికి నిర్వచనం చట్టాల్లో లేదనీ, 1976లో అత్యయిక పరిస్థితి సమయంలో మొదటిసారిగా దీనిని రాజ్యాంగంలో చేర్చి , తరువాత ఒక ఏడాదిలో తొలగించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతలకు హాని కలిగించే కార్యకలాపాలకు పాల్పడినవారి విషయంలో ఎలా వ్యవహరించాలో నేరన్యాయ చట్టాలు, న్యాయ సమీక్ష ఆదేశాల్లో ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News