Home జాతీయ వార్తలు భారత స్వీట్లను తిరస్కరించిన పాక్‌

భారత స్వీట్లను తిరస్కరించిన పాక్‌

 

న్యూఢిల్లీ: ఈద్, హోళీ, దీపావళి వంటి పండగల్లో సరిహద్దుల్లో కాపలా ఉండే మన దేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్), పాకిస్థాన్ రేంజర్లు పరస్పరం స్వీట్లు పంచుకోవడం పరిపాటి. అయితే, సోమవారం దేశంలో ఈద్ అల్‌అధా పండగ జరుపుకొన్నప్పటికీ అంతర్జాతీయ సరిహద్దు వెంట మిఠాయిలు పంచుకోవడం వంటి వేడుక జరగలేదని అధికారులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా పాకిస్థాన్ ప్రభుత్వం ఏకపక్షంగా మనదేశంతో దౌత్యసంబంధాల్ని తెగతెంపులు చేసుకుంది. ఈసారి సరిహద్దులో పండగ చేసుకోకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు.
జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల పొడవునా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. శుభాకాంక్షలు చెప్పుకొని, మిఠాయిలు పంచుకుందామని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారికంగా సమాచారం పంపినా పాకిస్థాన్ దాన్ని తిరస్కరించిందని అధికారులు తెలిపారు.

No Exchange of sweets between BSF, PAK