Thursday, March 28, 2024

జనం లేకే ఆ సినిమా తీసేశారు!

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టుకు తమిళనాడు పోలీస్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ని ‘షాడో బ్యాన్’ చేశారన్న సుప్రీంకోర్టు ఆరోపణను తమిళనాడు పోలీసులు ఖండించారు. ముస్లిం సంస్థ నిరసనలు, అభ్యంతరాల తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా 19 మల్టీప్లెక్స్‌లలో చిత్రం విడుదలయిందని, అయితే జనం లేక(పూర్ రెస్పాన్స్) సినిమాను తీసేయాల్సి వచ్చిందని వివరించారు. మల్టీప్లెక్స్ ఓనర్లే సినిమా ఆడించడం ఆపేసే నిర్ణయం తీసుకున్నారన్నారు.

సినిమా ఆడించొద్దన్న నిర్ణయం రాష్ట్రానిది కాదని, సినిమా థియేటర్ ఓనర్లే నిర్ణయం తీసుకున్నారని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటూ ఏమీ లేదని తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మే 5న తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 19 మల్టీప్లెక్స్‌లలో హిందీలో సినిమాను విడుదల చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లా అండ్ ఆర్డర్) లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి నిరసనకారులపై తమిళనాడు పోలీసులు తొమ్మిది కేసులు పెట్టారని తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

సన్‌షైన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్, నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సుప్రీంకోర్టు మే 12న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాల నుంచి రెస్పాన్స్ కోరింది. దేశవ్యాప్తంగా స్మూత్‌గా నడుస్తున్న సినిమాను తమ రాష్ట్రాలలో ఎందుకు ప్రదర్శించడంలేదని ప్రశ్నించింది. దీనికి తమిళనాడు పోలీసులు తప్పుడు ఆరోపణలు చేశారని, దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేశారని, వారు ఈ విధంగా పబ్లిసిటీ కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించినప్పటికీ, చూసే జనం లేకే సినిమా థియేటర్ ఓనర్లు ఆ సినిమా ఎత్తేశారు’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News