Friday, April 19, 2024

వాహన దారుల సమస్యలను పట్టించుకోని రవాణాశాఖ అధికారులు

- Advertisement -
- Advertisement -

No Facilities at Transport Department office in Khairatabad

కార్యాలయం ఆవరణలో దుకాణాలు బంద్
ప్రతి పనికీ కిలో మీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తోందంటున్న వాహనదారులు

హైదరాబాద్ : రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం తీసుకువచ్చే ప్రభుత్వశాఖల్లో రవాణాశాఖ కూడా ఒకటి. డ్రైవింగ్ లెసెన్స్‌లు, పర్మిట్లు, వాహన లైఫ్ ట్యాక్స్,ఫ్యాన్సీ నెంబర్లు తదితర కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంస్థకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. వాహనదారుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే రవాణశాఖ ప్రస్తుతం అటువంటి వాహనదారులను నిర్లక్షం చేస్తోంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో వాహన సంబంధిత పనులు నిమిత్తం వచ్చే అనేక మంది వాహనదారులు కనీస సౌకర్యం లేక పోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ పని చేయక పోవడంతో తాగు నీటి సౌకర్యానికి కూడా నోచుకోలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. కరోనా సమయంలో రవాణశాఖ కార్యాలయంలో ఆవరణలో ఉండే సుమారు 10 దుకాణాలను అధికారులు మూసివేశారు .

గత కొద్ది సంవత్సరాలగా ఆర్‌టివో కార్యాలయ ఆవరణలో ఇంటర్నెట్, జిరాక్స్, శీతల పానీయలు, స్టేషనరీ, తదితర దుకాణాలు ఉండటంతో వాహనదారులకు ఏచిన్న అవసరం వచ్చినా అక్కడే వచ్చి తమ పనులు పూర్తి చేసుకునేవారు. ప్రస్తుతం రవాణశాఖ సుమారు అన్ని సేవలను ఆన్‌లైన్ చేసింది. దీంతో ఆన్‌లైన్‌పై అవగాహన లేని వారు ఇక్కడే ఉండే ఇంటర్నెట్‌కు వచ్చి ఆన్‌లైన్ సంబందిత సేవలు పూర్తి చేసుకునే వారు. అదే విధంగా ఏవైనా వాహన సంబంధిత డాక్యుమెంట్స్ జిరాక్స్ కావాలన్నా ఇక్కడ ఉండే జిరాక్స్ సెంటర్‌లో తమకు సంబంధించిన డాక్యుమెంట్లను జిరాక్స్ తీసుకునేవారు. అంతే వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందే కార్యక్రమంలో ఇక్కడ శీతల పానీయలను సేవిస్తూ తమ దాహర్తిని తీర్చుకునే వారు. అయితే అధికారులు వీటన్నింటిని మూసి వేయడంతో ఏ చిన్న పని చేసుకోవాలన్నా రవాణశాఖ కార్యాలయానికి సుమారు 1 కిలో మీటర్ దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది. దీంతో వాహన సంబంధిత సేవల కోసం వచ్చేవారి డబ్బు, సమయం వృధా అవ్వడమే కాకుండా కొన్ని సందర్భాల్లో తాము బుక్ చేసుకున్న స్లాట్ సమయం కూడా ముగియడంతో తిరిగి మరో సారి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది.

సొసైటీ ఆధ్వర్యంలో దుకాణాలు

తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్టమెంట్ ఎంప్లాయిస్ మ్యూచివల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సోసైటీ ఆధ్వరంలో కార్యాయంలో ఆవరణలో 10 దుకాణాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు.వీటి ద్వారా వచ్చే రూ.70 వేల ఆదాయాన్ని కార్యాలయం ఆవరణలో ఉన్న గార్డెన్‌లో పని చేసేవారికి వేతనాల కింద ఇచ్చేవారు. వీటిని మూసి వేయడం ద్వారా సైసీటికి ఆదాయం రాక పోవడంతో అక్కడ గార్డెన్‌లో పని చేసే వారికి వేతనాలు కూడా ఇవ్వలేక పోతున్నామంటున్నారు. సోసైటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ కార్యాలయంలోని ఉన్న గార్డెన్‌కు ఉద్యానవన శాఖ ఉత్తమ అవార్డులు కూడా అందచేసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ అంశంపై తాము ఉన్నతాధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించు కోవడం లేదంటున్నారు. ఇకనైనా అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి సదరు దుకాణాలను తిరిగి ప్రారంభించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News