Saturday, April 20, 2024

విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదు: జెఎసి

- Advertisement -
- Advertisement -

current

హైదరాబాద్: కేంద్ర విద్యుత్ సంస్కరణలపై విద్యుత్ ఉద్యోగుల జెఎసి నిరసన తెలిపాయి. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని, కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని జెఎసి తెలిపింది. జూన్-1న దేశ వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని హెచ్చరించింది. విద్యుత్ సవరణ బిల్లుతో రైతులకు ఉచిత కరెంట్ ఉండదని, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఇచ్చే రాయితీలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కేంద్ర తీసుకొచ్చే విద్యుత్ సంస్కరణలతో తెలంగాణ రైతులు నష్టపోతారని, వన్ నేషన్ వన్ గ్రిడ్‌తో తీసుకరావడంతో రాష్ట్రాలు నష్టపోతాయని, విద్యుత్ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దన్నారు. సిఎం కెసిఆర్ ఇప్పటికే విద్యుత్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకమని చెప్పారని జెఎసి గుర్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News