Saturday, April 20, 2024

రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు

- Advertisement -
- Advertisement -

Ram-Janmabhoomi

అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా రామజన్మభూమికి చెందిన 67 ఎకరాలా స్థలంలో 4,5 ఎకరాలను ముస్లింలకు వదిలిపెట్టాలని అయోధ్యకు చెందిన తొమ్మిదిమంది ముస్లింల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఆర్ షంషద్ ఫిబ్రవరి 15న కొత్తగా ఏర్పడిన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర బోర్డు ట్రస్టీలకు ఒక లేఖ రాశారు. ఈ లేఖపై అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ ఝా జవాబిస్తూ రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల ప్రాంగణంలో ప్రస్తుతం ఎక్కడా ఎటువంటి స్మశానవాటిక లేదని స్పష్టం చేశారు.

రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉన్న కాలంలోనే ఈ అంశాలన్నీ విచారణకు వచ్చాయని, సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని వాస్తవాలు బయటపడ్డాయని ఝా తెలిపారు. గత ఏడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత 67 ఎకరాల స్థలం కేంద్రానికి బదిలీ అయిందని ఝా గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాము పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 15 మంది సభ్యులతో కూడిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన మొదటి సమావేశాన్ని ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు న్యాయవాది కె పరాశరన్ నివాసంలో సమావేశం కానున్నది. కొత్త ట్రస్టు సభ్యులలో పరాశరన్ కూడా ఉన్నారు.

No graveyard in Ram Janmabhoomi Says Ayodhya DM, SC lawyer MR Shamshad had wrote to the Board of trustees to leave four to five acre land within the 67 acre Ram Janmabhoomi campus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News