Friday, April 26, 2024

చాట్‌జిపిటితో ఉద్యోగ నష్టం ఉండదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టిసిసిఐ) ఐసిటి కమిటీ సోమవారం సాయంత్రం చాట్ జిపిటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై వెబ్‌నార్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాట్‌జిపిటి, జిపిటి టూల్స్ గురించి జయేష్ రంజన్ మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయనేది సాధారణ భయమే, కానీ ఇది కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అన్నారు. ఇప్పుడు కొత్త టూల్ జిపిటి జీరో ద్వారా క్రియేట్ చేసిన లేదా క్యూరేటెడ్ కంటెంట్‌లో ఎంత శాతం చాట్ జిపిటి ద్వారా చేశారో చెక్ చేసుకోవచ్చని అన్నారు. గత పదేళ్లలో టెక్నాలజీలో ఎన్నో అభివృద్ధిని చూశామని, చాట్‌జిపిటి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో విజ్ఞానాన్ని మెరుగుపరచడంలో సరికొత్తదని అన్నారు. సరదా ప్రయోజనాల కోసం, సరదాగా ప్రశ్నించడం కోసం చాట్ జిపిటి ఎక్కువగా ఉపయోగించబడుతోంది.

కానీ తాము అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు తెలుగు సామెతలు అడగ్గా, ఇది తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో మాత్రమే కాకుండా వాటి అర్థాలను కూడా ఇచ్చిందని అన్నారు. ఇది విస్తారమైన డేటా నుండి చాలా వేగంగా శోధించగల, సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఇది 100 శాతం ఖచ్చితమైనది కాదని అన్నారు. ‘జయేష్ రంజన్ ఎవరు? అని ప్రశ్నించగా, హెల్త్ సెక్రటరీ అని అది సమాధానం ఇచ్చింది . తాను ఎప్పుడూ ఆరోగ్య కార్యదర్శిగా పనిచేయలేదని అన్నారు. చాట్‌జిపిటి, జిపిటి సాధనాలు మానవ జాతికి ఎలా సహాయపడతాయో జయేష్ వివరించారు. భవిష్యత్తులో బాలీవుడ్ సినిమా కథలు మనషుల(రచయితల) ద్వారా కాకుండా చాట్ జిపిటి, జిపిటి టూల్స్ ద్వారా వస్తాయని టిసిఎస్ గ్లోబల్ హెడ్, సిఐఒ బాల ప్రసాద్ పెద్దిగారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News