Wednesday, April 24, 2024

వ్యాక్సినేషన్‌పై మీ జోక్యం సరికాదు

- Advertisement -
- Advertisement -

‘టీకా’ కాక.. కేంద్రం వర్సెస్ సుప్రీం
వ్యాక్సిన్ పాలసీపై మీ జోక్యం ఎందుకు?: న్యాయవ్యవస్థకు కేంద్రం సూటి ప్రశ్న

No judicial interference needed: Centre to SC on Vaccine Policy

 

న్యూఢిల్లీ: తాము రూపొందించిన కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీపై న్యాయస్థానాల జోక్యం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో కరోనా పరిస్థితి, టీకాల లభ్యత వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాక్స్ పాలసీని రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా అధికారిక నిర్వహణ అంశం. దీనితో న్యాయవ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదని, దీనిలో ఇతరుల జోక్యం అనుచితం అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం సుదీర్ఘ సమగ్ర అఫిడవిట్ ద్వారా తెలియచేసుకుంది. దీనిని తాజాగా ధర్మాసనానికి నివేదించారు. ఇది కీలకమైన ఎక్సిక్యూటివ్ వ్యవహారం, అధికార యంత్రాంగం చేపట్టే ప్రక్రియ, ఇందులో జుడిషియల్ జోక్యం అవసరం లేదు అని తేల్చిచెప్పింది. ఇటీవలి కాలంలో దేశంలో వ్యాక్సిన్ల పంపిణీ, ఆక్సిజన్ కొరత వంటి అంశాలపై సుప్రీంకోర్టు నేరుగా అధికార యంత్రాంగాలకు ఆదేశాలు వెలువరిస్తూ వస్తోంది. ఈ దశలో పలు ప్రాంతాలలో అధికార యంత్రాంగానికి కోర్టు నుంచి మందలింపులు వెలువడుతున్నాయి. కోర్టుల చర్యను తాము అర్థవంతమైన జోక్యంగానే భావిస్తున్నాం. అయితే ఎటువంటి అతిచేష్టలతో కూడిన జోక్యపు తంతు చివరికి అవాంఛనీ య పరిణామాలకు దారితీస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని తీసుకువచ్చామని కేంద్రం సమర్థించుకుంది. అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే వేర్వేరు ధరలు, డోస్‌ల కొరతలు, మందకొడి వ్యాక్సినేషన్లపై కేంద్రం ఇటీవలి కాలంలో విమర్శలు ఎదుర్కొంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకునే టీకాల ధరలను ఖరారు చేయడం జరిగింది. రాష్ట్రాలకు ఇతరత్రా ధరలు వేర్వేరుగా ఖరారు అయినా, కేంద్రం నుంచి లేదా ప్రభుత్వాల నుంచి లబ్థిదారులు అయ్యే అర్హులైన ప్రజలకు సరైన విధంగా టీకాలు అందుతాయని, ఇందులో ఇబ్బంది ఉండదనే విషయాన్ని కేంద్రం తెలియచేసుకుంది. వ్యాక్సిన్‌కు సంబంధించి తాము తీసుకునే పాలసీపై న్యాయస్థానాల జోక్యం అనుచితం అవుతుందని తేల్చిచెప్పింది.

ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం నుంచి పొందే టీకాలు ఇతరత్రా సేకరించుకునే టీకాలను ప్రజలకు అందులోనూ అర్హులైన వారికి ఉచితంగా అందేలా చేస్తామని తెలియచేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించాలని కేంద్రం స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పాలసీపై న్యాయవ్యవస్థ అత్యుత్సాహం పనికిరాదని కేంద్రం చురకలకు దిగింది. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విధానాన్ని రూపొందించుకుంది. న్యాయబద్ధం, సమాన పంపిణీ, విచక్షణారహితం, 45 ఏండ్లు అంతకు పైబడిన వారు అంతకు తక్కువ వయస్సు ఉన్న వారికి టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో అత్యంత విచక్షణాయుత సుస్పష్ట తేడాలను పాటించడం జరిగింది. అన్నింటికి మించి వివిధ దశల వ్యాక్సినేషన్ ప్రక్రియలు వీటి ద్వారా సమాజంలోని ఏఏ వర్గాలకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురావాలనే పలు అంశాలను పూర్తిస్థాయి వ్యూహాలతో కార్యాచరణకు తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. సంబంధిత రంగ నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాక్సిన్‌ల ఉత్పత్తిదార్లు ఇతరుల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుని సమగ్ర సంప్రదింపుల ప్రక్రియ తరువాతనే రూపొందించిన తమ పాలసీ పూర్తిగా రాజ్యాంగంలోని 14, 21 అధికరణలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు.
కేంద్రం అఫిడవిట్‌పై 13న సుప్రీం విచారణ
వివిధ అంశాలను ఉటంకిస్తూ కేంద్రం తమకు అందించిన అఫిడవిట్‌పై ఈ నెల 13న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో కొవిడ్ సంబంధిత పరిస్థితులపై నిర్వహణపై దాఖలు అయిన సుమోటో కేసు విచారణ దశలో కేంద్రం అఫిడవిట్ తలెత్తింది. తాము కేంద్రం వివరణను అన్ని విధాలుగా పరిశీలించడం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం తెలియచేసింది. కొవిడ్ రోగులను ఆసుపత్రులలో చేర్పించడం, వారికి సరైన చికిత్స వంటి విషయాలపై సమగ్రమైన జాతీయ విధానాన్ని రెండు వారాల వ్యవధిలో తీసుకురావాలని ఇప్పటికే కేంద్రానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.

No judicial interference needed: Centre to SC on Vaccine Policy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News