Home జగిత్యాల రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా…

రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా…

No longer compete in the next election

నియోజకవర్గ రాజకీయాల్లో ఇమడలేకే ఈ నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయను
జగిత్యాలలో ప్రకటించిన ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ
ఆర్‌టిసిని కాపాడుకునే బాధ్యత కార్మికులదే
మనతెలంగాణ/జగిత్యాల: రామగుండం నియోజకవర్గ రాజకీయాల్లో నేను ఇమడలేక పోతున్నా… అందుకే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా…వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ రామగుండం ఎంఎల్‌ఏ, ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ సోమవారం జగిత్యాలలో సంచలన ప్రకటన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఆర్‌టిసి బస్టాండ్‌లో మొక్కలు నా టేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్ర స్తుత పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో ఇమడలేనంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
క్రీయాశీల రాజకీయాల్లో ఉంటే పార్టీ అధిష్టానానికి లొంగి ఉండాల్సి ఉంటుందని, మనస్సు చంపుకుని పార్టీ నిర్ణయాలకు కట్టుబడాల్సి వస్తుందన్నారు. తన నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజాప్రతినిధులు తన మాట ను పట్టించుకోవడం లేదన్నారు.అదే సమయంలో పలు విషయాల్లో అధిష్టానాన్ని కూడా తాను ఒప్పించలేక పోతున్నాని,దీంతో నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యా యం చేయలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్నారు. ప్రభుత్వం చేస్తున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా మంచి మెజార్టీతో గెలుపొందుతారన్నారు. గత 15 సంవత్సరాలుగా టిఆర్‌ఎస్‌లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానని, తన పనితీరును బట్ట్టే ముఖ్యమంత్రి కెసిఆర్ తనకు ఆర్‌టిసి చైర్మన్ పదవిని కట్టబెట్టారన్నారు.క్రీయాశీల రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నా పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని, ముఖ్యమంత్రి కెసిఆర్ వెన్నంటి ఉండి పని చేస్తానన్నారు. కాగా రా మగుండం కార్పొరేషన్ మేయర్‌కు, ఎంఎల్‌ఏ సోమారం మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో మేయర్‌పై కా ర్పొరేటర్లు అవిశ్వాస పరీక్ష పెట్టిన నేపథ్యంలో సత్యనారాయణపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉండటంతో మనస్థాపం చెందిన సోమారపు ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
ఆర్‌టిసి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికుల పైనే ఉందని ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం జగిత్యాల ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో హరితహారంలో భాగంగా చైర్మన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మిగతా ప్రభుత్వరంగ సంస్థల్లా కాకుండా ఆర్ టిసి సంస్థ భిన్నంగా ఉంటుందని,ఆర్‌టిసి లాభాల్లో ఉంటేనే కార్మికులకు ప్రయోజనాలు చేకూ రుతాయన్నారు.జగిత్యాల డిపో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు.ఏటా రూ.8 కో ట్ల 50 లక్షల ఆదాయంతో అన్ని డిపోల కంటే ఎక్కువ లాభాల బాటలో నడుస్తుందన్నారు. ప్రమాదరహిత ఆర్టీసీ డిపో కూడా జగిత్యాలకు పేరు దక్కిందన్నారు. డిపోలో అధికారి నుండి మొదలుకొని కింది స్థాయి కార్మికుల వరకు సమన్వయంతో పని చేస్తేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయన్నారు.
ప్రతి కార్మికుడు ఆర్‌టిసి పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. సంస్థ ఆర్థికంగా దెబ్బతింటే కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని డిపోల్లో డ్రైవర్ల నిర్లక్షం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు చ ర్యలు చేపడుతున్నామన్నారు.ఈ సందర్భంగా ఆర్‌టిసి బస్టాండ్‌లో తనిఖీ నిర్వహించారు. తాగునీరు వ్యవస్థ మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఆర్‌టిసి బస్టాండ్ ఆ వరణలోకి వర్షపు నీరు వస్తుందంటూ కొంత మంది ప్రయాణీకులు ఫిర్యాదు చేయగా సదరు కాంట్రాక్టరును పిలిపించి నీరు లోపలకు రాకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి ఇడిలు రవీందర్, ఎం.వి. రావు, ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్, డివిజనల్ మేనే జర్ మద్దిలేటి డిపో మేనేజర్ హన్మంతరావు, అసిస్టెంట్ మేనేజర్ తిరుపతి, మెకానికల్ ఫోర్‌మేన్ గోపాల్‌రెడ్డి, అంజిరెడ్డి, సర్వీసుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.