- Advertisement -
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ, పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మంగళవారం బోధన్ బందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి అనుచరులు రాజీనామా పత్రాలను టిపిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ అందజేయడానికి హైదరాబాద్ కు బయలుదేరారు. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని సుదర్శన్ రెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికలలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే బోధన్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని సుదర్శన్ రెడ్డి అనుచరులు హెచ్చరించారు.
- Advertisement -