Home తాజా వార్తలు కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవ్…

కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవ్…

High Courtహైదరాబాద్ : తెలంగాణ ఆర్‌టిసి కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇచ్చేందుకు తమ వద్ద సరిపోను డబ్బులు లేవని ఆర్‌టిసి యాజమాన్యం తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. కార్మికుల జీతాల కోసం రూ.230 కోట్లు అవసరమవుతాయని, అయితే తమ వద్ద రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ఆర్‌టిసి కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని, వారు సమ్మె విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని యాజమాన్యం హైకోర్టును కోరింది. సెప్టెంబరు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ కేసును ఈనెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

No Money To Pay Salaries To TSRTC Workers