Home తాజా వార్తలు హరీశ్ తో ఇక ఘర్షణ ఉండదు : జగ్గారెడ్డి

హరీశ్ తో ఇక ఘర్షణ ఉండదు : జగ్గారెడ్డి

Jagga Reddyహైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో ఇకపై తనకు ఘర్షణ ఉండదని సంగారెడ్డి ఎంఎల్ఎ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు రెండోసారి టిఆర్ఎస్ కు పట్టం గట్టారని, ప్రభుత్వంపై విమర్శలు చేసినా, ప్రజలు పట్టించుకోరని ఆయన తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారిదేనని, సంగారెడ్డిలో హరీశ్ రావు ప్రచారం చేసుకున్నా, తనకు ఎటువంటి అభ్యంతరం లేదని జగ్గారెడ్డి చెప్పారు. టిపిసిసి చీఫ్ స్థాయిలో పెరిగిన తన ఇమేజ్ ను రేవంత్ రెడ్డి చెడగొట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

No More Confrontation With Harish Rao : Jagga Reddy