Thursday, April 25, 2024

ముసలివాళ్లు అస్సలు కనబడరు!

- Advertisement -
- Advertisement -

 

బ్రెజిల్‌లోని అమెజాన్ తీర ప్రాంతంలో బాహ్య ప్రపంచంతో సంబంధంలేని తెగలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. వాటిలో సురువాహ తెగ ఒకటి. దట్టమైన అడవుల్లో జీవిస్తుంటారు. బయటి ప్రపంచం నుంచి ఎవరైనా ఇక్కడికి వెళ్లాలంటే కొంతదూరం పడవమీదా, కొంతదూరం నడుచుకుంటూ దాదాపు వారం, పదిరోజులు ప్రయాణించాలి. అలా కొన్నాళ్ల కిందట వీళ్ల దగ్గరికి ఒక పరిశోధక బృందం వెళ్లింది. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం సురువాహ తెగవాళ్లు ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారట. జంతువులూ, పక్షుల్ని వేటాడుతూ వారు జీవనం సాగిస్తున్నారు. పరిశోధక బృందం తమతోపాటు పుస్తకం, అద్దంలో కొన్ని వస్తువుల్ని తీసుకువెళ్లింది. అద్దంలో చూసుకుంటూ ఎంతో ఆశ్చర్యపోయారట ఆ తెగవాళ్లు.

వీళ్లందరూ ఒకే కుటుంబంలా ఉంటారు. మగవాళ్లంతా ఆహారం సేకరించి సాయంత్రానికి ఇంటికి తెస్తారు. ఆడవాళ్లు పిల్లల పెంపకాన్ని చూసుకుంటారు. రోజూ రాత్రిళ్లు ఒకరకమైన పొడిని పీల్చుతూ అందరూ మత్తులో మునిగి తేలుతారు. సురువాహ తెగలో వృద్ధులు అస్సలు ఉండరు. వృద్ధులే కాదు, నడివాయస్సువాళ్లు ఉండరు. కారణం ౩౦ ఏళ్లు వచ్చిన వాళ్లంతా విషపూరితమైన ఒక చెట్టు వేళ్లను పొడిగా చేసి దాన్ని రోజూ కాస్త తింటూ ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకలా అంటే, చనిపోయి తమ తాత ముత్తాతలూ, తల్లీదండ్రులు, అన్నలు, అక్కల దగ్గరకి వెళ్తామని చెబుతారు. వీళ్లు పాటించే వాటిలో మరో దారుణమైన సంప్రదాయం ఉంది. పిల్లల్లో వైకల్యాన్ని గుర్తిస్తే వారిని అడవిలో దూరంగా జంతువులకు ఆహారంగా వదిలేస్తారు. ఒకటే భూమి… ఎన్నో భిన్న ప్రపంచాలు.

 

No Old Mans in Suruvaha Tribals in Amazon Area
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News