Home తాజా వార్తలు చలో ట్యాంక్ బండ్… ముందస్తు అరెస్టులు

చలో ట్యాంక్ బండ్… ముందస్తు అరెస్టులు

Tank Bund

 

హైదరాబాద్: ఆర్టీసి జెఎసి నాయకులు శనివారం తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకుండా మార్చ్ చేసిన నేతలను అరెస్టులు చేస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వైపు వస్తున్న అన్ని రహదారులపై నిఘా పెట్టిన పోలీసులు… అన్ని జిల్లాల్లో ఆర్టీసి ఉద్యోగులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అటు రాత్రిలోగా ఆర్టీసి యూనియన్ల నేతలతో పాటు రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేయాలని ఆదేశాలు అందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రేపు జరిగే చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆర్టీసి జెఎసి నాయకులు స్పష్టం చేశారు.

No permission granted for tomorrow Chalo Tank Bund