Thursday, April 18, 2024

రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు

- Advertisement -
- Advertisement -

రూ.2000 నోట్లపై ఏ నిర్ణయం తీసుకోలేదు
ప్రజల డిమాండ్ మేరకు ఆర్‌బిఐతో చర్చించి నిర్ణయం
గతేడాదిలో 273.98 కోట్లకు తగ్గిన నోట్ల సంఖ్య- కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ : రూ.2 వేల నోట్ల గురించి తరచూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై ప్రభుత్వం ఓ స్పష్టతనిచ్చింది. నోట్ల రద్దు ప్రకటన తర్వాత తొలుత ప్రవేశపెట్టిన ఈ రూ.2000 నోట్లను కొనసాగిస్తారా? లేదా? అనే సందేహాలకు మోడీ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఈ పెద్ద నోట్లను కొనసాగించకూడదు అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రూ.2 వేల నోట్ల ముద్రణను మాత్రం క్రమంగా తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. శనివారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ దీనికి సంబంధించిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రజల డిమాండ్ మేరకు నోట్ల విషయంలో ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్)తో సంప్రదించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 201920, 202021 కాలంలో రూ.2 వేల నోట్ల ముద్రణ విషయమై ప్రెస్‌లకు ఎలాంటి ఆదేశాలివ్వలేదని, అలాగే ఈ నోట్లను కొనసాగించకూడదు అని కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

2020 మార్చి 31 నాటికి మొత్తం 273.98 కోట్ల నోట్లు (రూ.2000) చలామణిలో ఉండగా, అంతకుముందు 2019 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 329.10 కోట్లతో పోలిస్తే తగ్గింది. ఆర్‌బిఐ ప్రకారం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో నోట్ల ముద్రణ తాత్కాలికంగా ఆగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు దశల వారీగా నోట్ ప్రింటింగ్ ప్రెస్‌లు ఉత్పత్తిని ప్రారంభించాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్) ప్రెస్‌ల ఉత్పత్తి 2020 మార్చి 23 నుంచి మే 3వరకు రద్దయింది. బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్ ప్రెస్‌ల వద్ద బ్యాంక్ నోట్ల ముద్రణ 2020 మే 4 నుంచి ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రెస్‌ల వద్ద కూడా ముద్రణపై ప్రభావం పడిందని ఎస్‌పిఎంసిఐఎల్ (సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది.

 No Plans to close Rs 2000 banknotes printing: Anurag Thakur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News