Saturday, April 20, 2024

ఇండియానే ఎంచుకున్నా…చైనాకు తిరిగివెళ్లను: దలైలామా

- Advertisement -
- Advertisement -
నెహ్రూ ఎంపిక చేసిన ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాస స్థానమన్నారు

కాంగ్రా: భారత్‌చైనాల మధ్య డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లో తలెత్తిన సరిహద్దు ఘర్షణ ఘటన తర్వాత దలైలామా సోమవారం మొదటిసారి స్పందించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ “యూరొప్, ఆఫ్రికా, ఆసియాలలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. చైనా కూడా మరింత సరళ వైఖరిని అనుసరిస్తోంది. అయినప్పటికీ చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నేను భారత్‌ను ఎంచుకున్నాను. ఇదే నా ప్రదేశం. ‘కాంగ్రా’ నెహ్రూ ఎంపిక. ఇదే నా శాశ్వత స్థానం” అన్నారు.
చైనాభారత్ జవానుల మధ్య జరిగిన ఘర్షణ చాలా చిన్నది. ఇరువైపుల కొందరికి గాయాలయ్యాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాడిచేశాక భారత్ తన దళాలను 30 నిమిషాలలో మోహరించింది. దాంతో వారు వెనుతిరిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News