Wednesday, November 30, 2022

త్వరలో డిజిటల్ రూపాయి

- Advertisement -

No proposal to recognise Bitcoin as a currency

 

బిట్‌కాయిన్‌ను గుర్తించే ప్రతిపాదనేది లేదు : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : దేశంలో కరెన్సీగా బిట్‌కాయిన్‌ను గుర్తించే ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, బిట్‌కాయిను గుర్తించే ప్రతిపాదనలు లేవు, అలాగే వీటి లావాదేవీల సమాచారం కూడా సేకరించబోమని అన్నారు. బిట్‌కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ, దీంతో ప్రజలు వస్తు, సేవలను పొందవచ్చు. ఈ ఎక్సేంజ్ మనీకి బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ చేసేవారు, ఇతర మూడో వ్యక్తితో సంబంధం ఉండదు. క్రిప్టోకరెన్సీగా గుర్తుతెలియని ప్రోగ్రామర్లు 2008లో ఈ బిట్‌కాయిన్‌ను, అలాగే ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఇది మొట్టమొదటి వికేంద్రీకరణ డిజిటల్ కరెన్సీ, ఎలాంటి మధ్యవర్తి లేకుండా పీర్ టు పీర్ లావాదేవీలను దీంతో నిర్వహించవచ్చు. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ బిల్2021ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లుతో అన్ని డిజిటల్ కరెన్సీలపై నిషేధం విధించినప్పటికీ కొన్ని క్రిప్టోకరెన్సీలకు మాత్రమే ఆర్‌బిఐ ద్వారా చలామణిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో ప్రశ్నకు సీతారామన్ స్పందిస్తూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్‌-సెప్టెంబర్ కాలంలో మూలధన వ్యయంగా రూ.2.29 లక్షల కోట్లను మంత్రిత్వశాఖలు, డిపార్ట్‌మెంట్లు ఖర్చు చేశాయని అన్నారు.

డిజిటల్ కరెన్సీ
డిజిటల్ రూపాయి తీసుకొచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ కోసం ఆర్‌బిఐ కసరత్తు చేస్తోందనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా క్రిప్టోకరెన్సీపై ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. బ్యాంక్ నోట్ అర్థాన్ని డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చేందుకు సవరణ ప్రతిపాదిస్తూ గత నెలలో ఆర్‌బిఐ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు ఒక ప్రతిపాదన పంపింది. ఆర్‌బిఐ ఈ దిశగా పలు అంశాలను పరిశీలిస్తోందని, ఎలాంటి అంతరాయం లేకుండా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టి దశల వారీగా వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోందని లోక్‌సభలో ఆర్థికమంత్రి తెలిపారు.

No proposal to recognise Bitcoin as a currency

Related Articles

- Advertisement -

Latest Articles