Wednesday, November 6, 2024

భవిష్యత్తులో కూడా ఆ షాట్లు అడుతా: విమర్శలపై రోహిత్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చేజేతులా వికెట్‌ను పారేసు కోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో రోహిత్‌లాంటి సీనియర్ ఆటగాడు తన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని, అయితే అతను మాత్రం అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔట్ కావడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఆడిన షాట్ తమను ఎంతో బాధకు గురిచేసిందని గవాస్కర్, మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా, గంభీర్ తదితరులు పేర్కొన్నారు. కుదురుకున్న సమయంలో ఇలాంటి షాట్ ఆడాల్సిన అవసరమే లేదని వారు అభిప్రాయపడ్డారు. వైస్ కెప్టెన్ వంటీ కీలక బాధ్యతల్లో ఉన్న సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ ఇలా నిర్లక్షంగా ఆడి వికెట్‌ను పారేసుకోవడంఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా రోహిత్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. అతన్ని ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు రోహిత్ మాత్రం తనపై వచ్చిన విమర్శలను కొట్టి పారేశాడు. ఆ షాట్ ఆడినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నాడు. గతంలో అదే టెక్నిక్‌తో విజయవంతంగా బౌండరీలను సాధించిన సందర్భఆలను గుర్తు చేశాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకే అలాంటి షాట్లు ఆడతానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి షాట్లు ఆడేందుకు వెనకాడబోనని రోహిత్ స్పష్టం చేశాడు.

No Regrets on dismissal at Gabba Test says Rohit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News