Home జగిత్యాల భద్రత లేని జీవితాలు

భద్రత లేని జీవితాలు

కారోబార్‌ల క్రమబద్ధ్దీకరణకు మోక్షమెప్పుడో…?

ఎన్నాళ్లీ ఎదురుచూపులు

Village

రాయికల్: తరబడి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ కార్యద ర్శులకు ధీటుగా పని చేస్తున్న కారోబార్‌ల జీవితాలు దిన దినగండంగా ఉన్నాయి. పొద్దస్తమానం పని చేసే వీరికి అందే వేతనం మాత్రం మూరడే. ఆ జీతం గ్రామ పంచాయతీ అధికారులు దయతలిస్తేనే లేదం టే పస్తులే. తమ ఉద్యోగానికి భరోసా కల్పించాల్సిన పాలకులు ఇచ్చిన హామిలను అమలు పరచకపో వడంతో హామీల అమలుకు చకోర పక్షుల్లా ఎదిరిచూ స్తున్నారు. తెలంగాణ వస్తే తమ జీవితాలకు భద్రత దొరుకుతుందని ఆశించిన కారోబార్‌లకు నిరాశే మిగిలింది.

కనీస వేతనాలు లేవు… ఉద్యోగ భద్రత లేదు… ఫీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు నిల్… గ్రామ పంచాయతీల్లో పని చేస్తూ ఏళ్లు గడుస్తున్న వేతనాల పెంపు అమలుకు నోచకోక చాలీ చాలనీ జీ(వి)తా లతో కారోబార్‌లు దయనీయస్థితిలో కొట్టుమిట్టాడు తున్నారు. 2002 సంవత్సరంలో కారోబార్‌ల ఉద్యోగా లను క్రమబద్దీకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 3 వందలకు పైగా కారోబార్‌లుండగా ప్రస్తుతం కొందరు పర్మినెంటు కాకుండానే ఉద్యోగ విరమణ పొందారు. రాయికల్ మండల పరిధిలో 27 గ్రామాలుండగా 15 మంది వరకు కారోబార్‌లు పని చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమానంగా విధులు నిర్వహిస్తుండే కారోబార్‌ల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం నిర్లక్షం చేయడంతో వీరు చాల ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన నిత్యవసరా వస్తువుల ధరల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో అందించే నెల వేతనం రూ.25 వందలు ఏ మూలకు సరిపోతుందో ప్రభుత్వానికే తెలియాలి.

కారోబార్‌ల విధులు ఇవి!

గ్రామ పంచాయతీ పరిధిలో పని చేసే కారోబార్‌లు ఇంటి,నల్లా పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, పంచాయతీలోని పారిశుద్య సిబ్బందిపై పర్యవేక్షణ, జనన, మరణ రికార్డుల నిర్వహణ, పంచాయతీ రికార్డుల నిర్వహణ తదితర పనులతో పాటు గ్రామ పంచాయతీకి వచ్చే అధికారులకు సహకరించడం లాంటి పనులతో ఇబ్బంది పడుతున్న కారోబార్‌ల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతుంది. గ్రామ పంచాయతీల్లో అన్నీ తామై ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తున్న వీరి పట్ల పాలకులు కనికరం చూపకపోవడం శోచనీ యమే. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూస్తున్న కారోబార్‌లు నెల నెల పెన్షన్‌లు పంపిణీ చేసే పనులతో రోజంతా బీజీగా గడుపుతుంటారు. 1958 సంవత్సరంలో కార్బరీ వ్యవస్థ ప్రారంభమై కాలక్రమేనా కారోబార్‌గా మారిన వీరి బతుకులు మాత్రం మారడం లేదు.

అమలుకు నోచని హైకోర్టు తీర్పు

గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు ధీటుగా పని చేస్తున్న కారోబార్‌లను పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని హైకోర్టు 2002 సంవత్సరంలో ఇచ్చిన తీర్పు అమలుకు నోచలేదు. కొందరు కారోబార్‌లు సంఘటితంగా కోర్టుకు వెళ్లి తమ వ్యథను విన్నవించగా విచారణ జరిపిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన ఫలితం లేకపోయింది. దాంతో చాల మంది ఏళ్ల తరబడి పని చేస్తూ వృద్దాప్యం బారిన పడుతున్నారు. కొందరు పదవీ విరమణ చేసారు. పిఎఫ్,ఈఎస్‌ఐ తదితర సౌక ర్యాల అమలు ఎండమావిగానే ఉంది. 613 జీవోను అమలు చేసి ఆదుకోవాలని కారోబార్‌లు ప్రభు త్వా న్ని ముక్త కంఠంతో కోరుతున్నారు.

కార్యదర్శులుగా నియమించాలి

ఎన్నో ఏళ్గు గ్రామ పంచా యతీల్లో పని కారోబార్ లుగా పని చేస్తున్నాం. తెలంగాణ వస్తే తమ ఉద్యోగాలు పర్మినెంటు అవు తాయని ఎదిరిచూ స్తున్నాం. చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతు న్నాం. హైకోర్టు తీర్పును అమలు చేసి తమను కార్యద ర్శులుగా నియమించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
ప్రశాంత్, కారోబార్, వీరాపూర్

ప్రభుత్వం దయచూపాలి

తెలంగాణ సర్కార్ దయ చూపి కారోబార్‌లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలి. రూ.1500 నుండి రూ. 25వందల నెల వేతనంతో కుటుం బాలతో జీవించడం ఇబ్బంది అవుతుంది. 2002 సంవత్సరంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం మా పై దయ చూపాలి. ఏళ్ల తరబడి తక్కువ వేతనంతో పని చేస్తున్న తమ జీవితాలకు భద్రత కల్పించాలి.
– దొంతి రాజేందర్, కారోబార్, కుమ్మరిపెల్లి