Friday, April 26, 2024

తల్లిపాలలో ఫైజర్, మోడెర్నా టీకాల అవశేషాలు ఉండవు

- Advertisement -
- Advertisement -
No sign of Pfizer- Moderna Covid vaccines in breast milk
యుఎస్‌సిఎఫ్ పరిశోధకుల అధ్యయనం

లాస్ ఏంజెల్స్ : తల్లిపాలలో ఫైజర్, మోడెర్నా టీకాల అవశేషాలు ఉంటాయనడానికి ఆధారాలు ఏవీ కనిపించలేదని పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు బిడ్డకు తల్లి పాలిచ్చేటప్పుడు మోడెర్నా టీకా వల్ల రక్షణ కలుగుతుందని కూడా అధ్యయనం వివరించింది. అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యుఎస్‌సిఎఫ్) పరిశోధకులు చేపట్టిన ఈ చిన్నపాటి అధ్యయనం జర్నల్ జామా పెడియాట్రిక్‌లో వెలువడింది. బిడ్డలకు తల్లి పాలిచ్చేటప్పుడు వ్యాక్సినేషన్ ప్రభావం వల్ల ఎంతవరకు భద్రత ఉంటుందో అన్న దానిపై ఈ అధ్యయనం జరిగింది. ఎవరైతే వ్యాక్సిన్‌ను వద్దనుకుంటారో, లేదా పాలివ్వడం ఆపేస్తారో అలాంటి తల్లులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. ఫైజర్, మోడెర్నా టీకాలను తీసుకున్న ఏడుగురు తల్లులపై ఈ అధ్యయనం నిర్వహించగా వారిలో వ్యాక్సిన్ అవశేషాలు ఏవీ కనిపించలేదు. ఇదివరకటి అధ్యయనం మోడెర్నా వ్యాక్సిన్ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుందని తేల్చింది. బిడ్డకు పాలిచ్చే తల్లులు కూడా టీకాలు పొందవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల వెల్లడించింది.

No sign of Pfizer- Moderna Covid vaccines in breast milk

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News