Home సూర్యాపేట స్వైన్ ప్లూ భయం వద్దు

స్వైన్ ప్లూ భయం వద్దు

* జిల్లాలో స్వైన్ ప్లూతో ఎవరూ చనిపోలేదు : జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్
* మునగాలలో సెలబ్రల్ మలేరియాతో పిచ్చమ్మ అనే వృద్ధురాలు మృతి

swine-flu12

మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : జిల్లాలో స్వైన్ ప్లూ బారిన ఎవరు చనిపోలేదని ఈ విషయంలో ఎవరు భయ పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. మునగాల మండల కేంద్రానికి చెందిన కె.పిచ్చమ్మ అనే వృద్ధురాలు సెలబ్రల్ మలేరియాతో మృతి చెందినట్లు దీనిని మునగాల పిహెచ్‌సి అధికారి డాక్టర్ యాదా రమేష్ ధృవీకరించినట్లు తెలిపారు. స్వైన్ ప్లూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీనిపై ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ఒకవేళ అనుమా నాస్పదంగా కేసులు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే వారిని సూర్యాపేట ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపి మెరుగైన వైద్య సేవలు నిర్వ హించేందుకుగానూ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రత్యే క అంబులెన్స్‌లో పంపనున్నట్లు తెలిపారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో స్వైన్ ప్లూకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వైన్‌ప్లూకి సంబంధించి అవసరమైన మందులు ఆసుపత్రిలో సరిపడా అందుబాటులో ఉన్నట్లు తెలి పారు. ఫిబ్రవరి వరకు చలి తీవ్రత ఉండే అవకాశం ఉండగా ముందు జాగ్రత్తగా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ప్రజలు తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఖర్చీప్‌ను నోటికి, ముక్కులకు అడ్డుగా పెట్టుకోవాలని, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బదులు రెండు చేతులు జోడించి నమస్కరించాలని సూచించారు. పాఠశాల ప్రార్థన సమయంలో స్వైన్‌ప్లూపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రచార సామాగ్రిని సక్రమంగా పంపిణీ చేయించాలని డిఎంహెచ్‌వోను ఆదేశించారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణీలు, 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు 18 నెలల లోపు పిల్లలు డయాబెటిక్ వ్యాధి గ్రస్తులు మరింత అప్పమత్తతతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మురళీమోహన్, స్త్రీనిధి ఈజిఎం విద్యాసాగర్, డిఆర్‌డివో కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.