Home నాగర్ కర్నూల్ మూగజీవాలపై జాలి లేదా…

మూగజీవాలపై జాలి లేదా…

* పశువులకు  అందని వైద్యం
* సిబ్బంది కొరతతో ఉప కేంద్రాల మూత
* స్వంత వైద్యంపై  ఆధారపడిన పెంపకందారులు

No Treatment to Animals in NagarKurnoolకోడేరు : రాష్ట్రంలో పాడి సంపద, పశు పోష న పెంపొదిస్తామని ప్రభుత్వం చెప్పుకొస్తున్న ఆచరనలో మా్ర తం అమలు కావడం లేదు. ఏళ్ల తరబడి వైద్యులు లేక పోవడం తో తాత్కలిక సిబ్బంది చేస్తున్న అరకోర వైద్యం చేస్తుండడంతో పశుపోషకులు గ్రామాలల్లో స్వంత వైద్యాన్ని నమ్ముకుం టున్నారు. గత పదేళ్ల కాలంలో మండలంలో గొర్రెలు, మేక లు, పాడి సంపదపై రైతులు దృష్టి సారించారు. వీటి పెంపకం దారులు తమకున్న స్వంత వైద్యంతో కాలం వెళ్లదీస్తున్నారు. మండలకేంద్రంలో ఉన్న పశువైద్యశాలకు డాక్టర్ లేకపోవడం, సరిపడా మందులు రాక పోవడంతో చాలా వరకు ఆసుపత్రి వైపు వెళ్లరు. వచ్చిరాని వైద్యంతో తమకున్న కొద్దిపాటి పరిజ్ఞా నంతో కాలం వెళ్లదీస్తున్నారు.

ఇవి ఖాళీలు :

మండలంలో ఒక ప్రదాన ఆసుపత్రి, 7 ఉపకేంద్రాలు ఉన్నా యి. మండల కేంద్రంలోని ప్రదాన వైద్యశాలకు రెగ్యులర్ డాక్టర్ లేక ఇన్‌చార్జి డాక్టర్‌తో ఏళ్ల తరబడి నడుస్తుంది. ఉప కేంద్రాలల్లో ఉన్నది ముగ్గురే సిబ్బంది . మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి.

ఇవి మండలంలో మూగజీవాలు:

మండలంలో సుమారు 84 వేల మూగ జీవాలు ఉన్నాయన్నది అధికారుల ఘణాంకాలు తెలుపుతున్నాయి. అయితే వీటికి సరియైన వైద్యం అందక పోవడంతో పెంపకందారులు తెలి సిన కొద్దిపాటి వైద్యాన్ని అందిస్తున్నారు. పశువులకు అం దించే మందులు లేకపోవడం, అధికారుల అజమాయిషి క్రింది స్థాయి సిబ్బందిపై లేకపోవడంతో వచ్చిన మందులు ఎక్కడికి వెళ్తున్నాయే అర్థం కాని పరిస్థితి అని పశుపోష కులు ఆరోపిస్తున్నారు.

వైద్యం కరువు:

ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్ లేక పోవడంతో పశుపోషకులు తాత్కాలిక ఉద్యోగితో వైద్యం చేయించుకుంటున్నారు. ఉప కేంద్రాలల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా ఉంటే మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని పెంపకం దా రులు అంటున్నారు.

మందులు కరువే :

వైద్యం తిప్పలు దెవుడెరుగు పశువైద్యశాలలో మూగజీవాల కు మందులూ… కరువయ్యాయి. రొగమెచ్చి వైద్యం కొసం వెళ్లితే చికిత్స చేసేందుకు మందులు కూడా కరువయ్యా యని అలాంటప్పుడు పశువైద్యశాల ఎందుకని ప్రశ్నిస్తు న్నారు.

రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలి :
తెలంగాణ గొర్రెలు,మేకల పెంపకందారులు సంఘం సభ్యు లు చంద్రమౌళి కోడేరు పశవైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలి. ఏళ్ల తరబడి ఇన్‌చార్జి డాక్టర్ ఉండడంతో గొర్రెలు, మేకలకు సరియైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. వైద్యశాలలో అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.

త్వరలోనే రెగ్యులర్ డాక్టర్ వస్తారు: డాక్టర్ మదు
మండల కేంద్రంలోని ప్రదా న ఆసుపత్రికి త్వరలోనే రెగ్యులర్ డాక్టర్ వస్తారు. ఇన్‌చార్జి బాద్యతలతో ఇ బ్బందులు ఏర్పడుతున్నా యి. వీలైనంత వరకు ఆసు పత్రికి వైద్యానికి తెచ్చిన వా టికి చికిత్సలు నిర్వహిస్తు న్నాం. మందులు పక్కదారి పడితే చర్యలు తీసుకుంటాం.