Home అంతర్జాతీయ వార్తలు వైద్యరంగంలో నోబెల్ విజేతల వివరాలు విడుదల

వైద్యరంగంలో నోబెల్ విజేతల వివరాలు విడుదల

Nobelస్వీడెన్ : అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని వైద్య రంగంలో అత్యంత కృషి చేసినందుకు 2015 సంవత్సరంలో అందుకోనున్న శాస్త్రవేత్తల వివరాలను సోమవారం ప్రకటించారు. ఈ బహుమతిని ముగ్గురికి అందిచనున్నారు. బహుమతిని ప్రధానంగా చైనాకు చెందిన యూయూ టు అందుకోనున్నారు. మలేరియా వ్యాధి నివారణ కోసం ఆమె చేసిన కృషికి గుర్తిస్తూ అవార్డులో సగ భాగం అందజేస్తున్నట్లు తెలిపారు. జపాన్‌కు చెందిన సతోషి ఓమురా, న్యూజెర్సీకి చెందిన విలియం సి.క్యాంప్‌బెల్ లకు ఈ అవార్డు మిగితా భాగం అందజేస్తున్నట్లు తెలిపారు. మిగితా అవార్డు విజేతల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ పురస్కారాన్ని అందుకోనున్న ముగ్గురు మరణించిన వారే.