Home తాజా వార్తలు అభిజీత్ బెనర్జీ, మరి ఇద్దరికి ఆర్థిక నోబెల్

అభిజీత్ బెనర్జీ, మరి ఇద్దరికి ఆర్థిక నోబెల్

Nobel Prize

స్టాక్‌హోం: ఈ ఏడాది అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ముగ్గురిని ఎంపిక చేశారు. ప్రప ంచ పేదరికంపై వీరు క్షేత్రస్థాయిలో సాగించిన ఆర్థిక అధ్యయన పోరుబాటకు గుర్తింపుగా అ వార్డును ప్రకటించారు. భారతీయ సంతతికి చె ందిన అమెరికన్ అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తెర్ డఫ్లో, అమెరికాకు చెందిన ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైఖైల్ క్రెమెర్‌కు సంయుక్తంగా 20 19 ఆర్థిక శాస్త్ర నోబెల్‌ను అందించనున్నట్లు
సోమవారం రాయల్ స్వీడిష్ నోబెల్ కమిటీ తెలిపింది. ప్రపంచ మానవాళి అత్యధిక శాతం ఎ దుర్కొంటున్న జీవన్మరణ సమస్య పేదరికం. ఈ కడు పేదరిక సమస్యను సమగ్రంగా విశ్లేషించుకుని, సూక్ష్మ స్థాయిలో దీనిపై పోరు సల్పేందు కు ఈ ముగ్గురు ఆర్థికవేత్తలు జరిపిన అధ్యయనానికి గుర్తింపుగా ఈ పురస్కారాలకు వీరిని ఎంపిక చేశారు. కేవలం పత్రాలకు, గణాంకాలకు పరిమితం కాకుండా కెన్యా వంటి పేదదేశాలలో క్షేత్రస్థాయిలో పేదరిక స్థితిగతులను తెలుసుకుని తగు విధం గా నిర్మూలనా పథకాల రూపకల్పనకు వీరు ప్రాధాన్యతను ఇచ్చి, అందుకు గుర్తింపుగా ఈ నోబెల్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. బహుమతి దక్కిన వారిలో ఒకరైన బెనర్జీ ప్రస్తుతం అమెరికాలోని మసాచ్యుసెట్స్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి మిట్)లో ఫోర్డ్ ఫౌండేషన్ అంతర్జాతీయ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు.

ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిజిత్ బెనర్జీ1961లో ముంబైలో జన్మించారు. 58 సంవత్సరాల ఈ ఆర్థికవేత్త హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో 1988లో పిహెచ్‌డి పట్టా పొందారు. ఆయన విద్యాభ్యాసం యూనివర్శిటీ ఆఫ్ కలకత్తాలోనూ, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోనూ సాగింది. తరువాత బెంగాల్ వీడి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. 2003లో ఆయన అబ్దుల్ లతీఫ్ జమీల్ పేదరిక నిర్మూలనా కార్యాచరణ కేంద్రాన్ని తన తోటి ఫ్రెంచ్ అమెరికన్ భార్య డఫ్లోతో కలిసి స్థాపించారు. ఆమె కూడా ఎంఐటి ప్రొఫెసర్‌గా, సెంధిల్ ములైనథన్ అధ్యాపకురాలిగా కూడా ఉన్నారు. ఇక బెనర్జీ లాబ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారని ఎంఐటి వెబ్‌సైట్ ద్వారా వెల్లడైంది.
ఈ త్రయం పలు దేశాలకు స్ఫూర్తిదాయకం
క్షేత్రస్థాయిలో పేదరిక నిర్మూలనకు రంగంలోకి దిగిన ఈ ముగ్గురుతో కెన్యా వంటి పేదదేశాలలో స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెరిగాయని, పలు దేశాలు వీరి ఆర్థిక సూత్రాల ప్రాతిపదికన తమ దేశాల ఆర్థిక రంగాలలో చర్యలు చేపట్టారని నోబె ల్ కమిటీ పేర్కొంది. ఇక భారతదేశంలో ఈ ఆర్థికవేత్తల ప్రతిపాదనలతో అరకోటి మంది చిన్నారులు లబ్థి పొందినట్లు గుర్తించామని కమిటీ వెల్లడించింది.
గర్వకారణం : అభిజిత్ తల్లి
కోల్‌కతా : కుమారుడు అభిజిత్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ రావడంపట్ల ఆయన తల్లి నిర్మలా బెనర్జీ హర్షం వ్యక్తం చేశా రు. ఇది తనకు ఆనందం కల్గించిందని, గర్వకారణం అయిందని స్పందించారు. తాను ఉప్పొంగిపొయ్యే క్షణం ఇదని చెప్పారు. కేవలం కుమారుడే కాకుండా కోడలు కూడా ఈ పురస్కారానికి ఎంపిక కావడం మరింత సంతో షం ఇచ్చిందని తెలిపారు. ఆర్థికశాస్త్రంలో రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన నిర్మల కోల్‌కతాలో ఉంటున్నారు. తన ఆనందాన్ని ఇంకా కుమారుడితో పంచుకోలేదని, అమెరికాలో రాత్రి పూట అయినందున సమ యం చూసుకుని తరువాత ఆయనతో ఫోన్‌లో మాట్లాడుతానని తెలిపారు. తన కోడలు పిల్ల మంచి తెలివితేటలున్న వ్యక్తి అని తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల అభినందనలు
భిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో ఆయన సృజనాత్మక రీతిలో వ్యవహరించారని, మౌలిక స్థాయి లో సత్ఫలితాలు దక్కాయని ప్రధాని మోడీ అన్నారు. ఆయన సేవలకు సముచిత గుర్తింపు దక్కిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, పశ్చిమ బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఇతర ప్రముఖులు అభినందించారు. బెంగాలీల ఖ్యాతిని అభిజిత్ ఖండాంతరం చేశారన్నారు.
అభిజిత్ బెనర్జీకి అమర్తసేన్ అభినందన
అభిజిత్ వినాయక్ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉందని, సంతోషాన్ని కలిగించిందని నోబెల్ గ్రహీత అమర్తసేన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షేమానికి ఆయన అందించిన సేవలకు అమర్తసేన్‌కు 1998లో ఇదే అవార్డు లభించింది. బోస్టన్‌లో పిటిఐతో మాట్లాడుతూ సేన్ ఎస్తేర్ డఫ్లో, మైకేల్ క్రెమర్‌లతో పాటు అభిజిత్ ఈ అవార్డు పొందడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రశంసించారు. 58 ఏళ్ల అభిజిత్ వినాయక్ బెనర్జీ తన భార్య ఎస్తేర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డును పంచుకోవడం విశేషం. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు వీరు ముగ్గురూ చేసిన ప్రయోగాత్మక కృషికి ఈ పురస్కారం లభించింది. ‘ఎంతో సమర్థత ఉన్నవారికి ఈ బహుమతి ఇచ్చారని భావిస్తున్నాను’ అని సేన్ వ్యాఖ్యానించారు. బెనర్జీ ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి)లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్‌లో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. సేన్, బెనర్జీ ఇద్దరూ కూడా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు.

n భారతీయ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ పలు విశిష్ట స్థానాలలో సేవలు అందించారు. ఆయన గతంలో ప్రగతి సంబంధిత ఆర్థిక విశ్లేషణ పరిశోధనా విభాగంలో బ్యూరో సారధిగా ఉన్నారు.
n ఎన్‌బిఇఆర్, సిఇపిఆర్, కియిల్ ఇనిస్టూట్, ఎకనామెట్రిక్ సొసైటీ వంటి పలు సంస్థలలో పరిశోధనా సారథ్య బాధ్యతలు వహించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్సెస్‌కు గౌరవసభ్యుడిగా ఎన్నికయ్యారు.
n గతంలో ఇన్ఫోసిస్ ప్రైజు కూడా దక్కించుకున్నారు. గగెగన్‌హెయిమ్, అల్ఫ్రెడ్ పి సొలాన్ ఫెలోగా కూడా ఉన్నారు.ఆర్థిక విశ్లేషణలతో పలు వ్యాసాలు రాసిన బెనర్జీ నాలుగు పుస్తకాలు కూడా రాశారు. ఆయన రాసిన పూర్ ఎకనామిక్స్ పుస్తకానికి ది గోల్డ్‌మెన్ సాక్స్ బిజినెస్ బుక్‌గా 2011లో ఉత్తమ పురస్కారం దక్కింది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 17 భాషలలో అనువాదం అయింది. మరో మూడు పుస్తకాలకు సంపాదకులుగా కూడా బెనర్జీ వ్యవహరించారు. ఆర్థిక విశ్లేషణలతో కూడిన రెండు లఘుచిత్రాలను కూడా నిర్మించారు.
n 2015 అనంతర అభివృద్ధి అజెండాకు అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ ఏర్పాటు చేసిన ప్రముఖ వ్యక్తులతో కూడిన ఉన్నతస్థాయి బృందంలో సభ్యులుగా కూడా నియమితులు అయ్యారు.
n అభిజిత్ తండ్రి దీపక్ బెనర్జీ. ఆయన ప్రెసిడెన్సీ కాలేజీలో ఆర్థిక ప్రొఫెసర్‌గా పనిచేశారు. తల్లి నిర్మలా బెనర్జీ కూడా ఆర్థికవేత్తగా వ్యవహరించారు.
n సౌత్ పాయింట్ స్కూలు విద్యార్థి
n అభిజిత్ బెనర్జీ కలకత్తాలోని సౌత్ పాయింట్ స్కూలులో చదివారు. తరువాత ప్రెసిడెన్సీ కాలేజీలో 1981లో బిఎస్‌సి చేశారు. తొలుత బి స్టాట్‌లో చేరినా తరువాత ఆయన ఎకనామిక్స్ చదివారు. తరువాత ఫిజిక్సును ఎంచుకున్నారు. కానీ ఆర్థికశాస్త్రం వైపు చివరికి మొగ్గు చూపి ఈ దిశలోనే దూసుకువెళ్లారు.

Nobel Prize in Economics won by Banerjee