Wednesday, April 24, 2024

ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు నోబెల్ సాహిత్య పుర‌స్కారం

- Advertisement -
- Advertisement -

Annie Ernaux

స్టాక్ హోమ్(స్వీడెన్):  సాహిత్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క నోబెల్ బ‌హుమ‌తి ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌ను వ‌రించింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ గురువారం సాయంత్రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ‘ఫ‌ర్ ద కరేజ్ అండ్ క్లినిక‌ల్ అక్యూటీ…’ పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. 1974లోనే ర‌చ‌న‌లు మొద‌లుపెట్టిన ఎర్నాక్స్‌ ఈ ఏడాది త‌న 82 ఏట నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక‌య్యారు.

సాహిత్యంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన‌ ఎర్నాక్స్‌ ప్ర‌ధానంగా ఆత్మకథలు(ఆటోబ‌యోగ్ర‌ఫీలు) రాశారు. త‌న త‌ల్లిదండ్రుల‌తో త‌న అనుబంధం, త‌ద‌నంత‌రం త‌న జీవితంలో చోటుచేసుకున్న ప‌రిణామాల ఆధారంగా ర‌చ‌న‌లు చేశారు. తొలుత ఫిక్ష‌న్ న‌వ‌ల‌ల‌తోనే త‌న ప్ర‌స్థానం మొదలుపెట్టినా ఆ త‌ర్వాత ఆత్మకథల దిశ‌గా ఆమె మళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News