Home అంతర్జాతీయ వార్తలు నోకియా ఫోన్ నిండు ప్రాణాలు కాపాడింది!

నోకియా ఫోన్ నిండు ప్రాణాలు కాపాడింది!

Nokia-301కాబూల్: నోకియా ఫోన్ తుపాకీ గుండును అడ్డుకుని ఓ వ్యక్తి నిండు ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన పొరుగు దేశమైన ఆఫ్ఘాన్‌లో జరిగింది. ఓ వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న నోకియా 301 మొబైల్ ఆకస్మాత్తుగా దూసుకువచ్చిన బుల్లెట్‌కు అడ్డుపడింది. దీంతో ఆ వ్యక్తి తనకు నోకియా రెండో జన్మను ఇచ్చిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను పీటర్ స్కిల్‌మ్యాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.