Home తాజా వార్తలు త్వరలో నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్

త్వరలో నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్

Noia

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు సంస్థ నోకియా తన నూతన స్మార్ట్ ఫోన్ ను (నోకియా 5.1 ప్లస్)ను హెచ్‌ఎండి గ్లోబల్ జులై 11వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ రూ.15వేల వరకు ఉండవచ్చని సమాచారం.  ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు…

5.86 ఇంచ్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్

128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్

13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

4జీ వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.