Home తాజా వార్తలు అద్భుత ఫీచర్లతో నోకియా నయా స్మార్ట్‌ఫోన్

అద్భుత ఫీచర్లతో నోకియా నయా స్మార్ట్‌ఫోన్

Nokia 7.1 plus smartphone release tomorrow

ముంబయి: హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన కొత్త స్మార్ట్ ఫోన్ నోకియా 7.1 ప్లస్‌ను మంగళవారం రిలీజ్ చేయనున్నారు. రెడ్, సిల్వర్, బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీని ధర వివరాలు  సంస్థ ఇంకా వెల్లడించలేదు.

నోకియా 7.1 ప్లస్ అద్భుత ఫీచర్లు…

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే

2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్

400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ సౌకర్యం ఇందులో ఉంది.

ఆ0డ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై)

12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ లో లభిస్తున్నాయి.