Home అంతర్జాతీయ వార్తలు ఉ.కొరియా బాంబు ప్రకంపన

ఉ.కొరియా బాంబు ప్రకంపన

హైడ్రోజన్ బాంబు పరీక్షించినట్టు ప్రకటన
ప్రయోగంతో కంపించిన భూమి
అమెరికా, చైనా నిరసన

north-koreaసియోల్: ప్రపంచ దేశాలలో ఒంటెత్తు పోకడగల దేశంగా పేరుపడ్డ ఉత్తర కొ రియా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు బుధవారం నాడు ప్రకటించింది. ఆ చాటింపు నిజమైతే తమ అణు కార్యక్రమాలపై గల నిషేధాన్ని ఆ దేశం లెక్కచేయనట్లే. ఆ దేశ తాజా అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచంలో పెద్దగా చర్చను లేవనెత్తుతుంది. ఉద యం 10ంటలకు తొలి హైడ్రోజన్ బాంబ్ పరీక్షను తాము విజయవంతంగా జరిపినట్లు రేడియోలో ఉత్తర కొరియా ప్ర కటించింది. తమ చారిత్రక హైడ్రోజన్ బాంబ్ పరీక్ష ఖచ్చిత విజయం సాధించడం ద్వారా అత్యాధునిక అణుసంపన్న దే శాల సరసన తాము చేరినట్లు ఆ దేశం ప్రకటించుకొంది. ఈ పరీక్షను చిన్న బాంబుతో చేశామని రేడియో ప్రకటన తెలి పింది. హైడ్రోజన్ బాంబును థర్మో న్యూక్లియర్ బాంబు గా పేర్కొంటారు. ఇది యురేనియం, ప్లుటోనియంల ద్వారా జరిగే విచ్ఛేదన(ఫిషన్) ప్రక్రియలో జరిగే ప్రేలు డుకంటే తీవ్రమైనది. విస్ఫోటన(ఫ్యూజన్) ప్రక్రియ ద్వారా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించే మరింత శక్తివంతమైన ప్రేలుడుకు ఇది మూలం. తాము ఈసరికే హైడ్రోజన్ బాంబును రూపొందించి నట్లు గతనెల ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్-యున్ ప్రకటించారు. అంత ర్జాతీయ నిపుణులు ఆ ప్రకటనను ఖండించారు. బుధవారం నాటి ఉత్తర కొరి యా హైడ్రోజన్ బాంబు పరీక్ష ప్రకటన నిజానిజాలను వారు సందేహిస్తున్నా రు. అది అమెరికా హిరోషిమా బాంబు పరిమాణంలోది కావచ్చని రాండ్ కార్పొరేషన్‌కు చెందిన బ్రూస్ బెనెట్ బిబిసికి తెలిపారు. హైడ్రోజన్ బాంబు అయిఉండదన్నారు. అది ఫిషన్ టెక్నాలజీకి సంబంధించినది కావచ్చని చెప్పారు. పేలుడు శక్తిని బట్టిచూస్తే అది థర్మో న్యూక్లియర్ 2 దశ బాంబు కాదని వివరించారు. ఆ బాంబు ప్రేలుడు శక్తి పదిరెట్లు ఎక్కువని తెలిపారు. కిమ్ జన్మదినానికి రెండే రోజుల ముందు జరిగిన ఈ పరీక్ష అంతర్జాతీయ ప్ర కంపన మానిటర్లు గుర్తించాయని తెలిసింది. ఉత్తర కొరియా ఈశాన్య భాగం లోని పునెగ్గెయేరి వద్దగల అణుపరీక్షల ప్రదేశం సమీపంలో ఈ ప్రేలుడు ద్వా రా 5.1తీవ్రతతో ప్రకంపన రికార్డయిందని, థర్మో న్యూక్లియర్ బాంబు త యారీకి ఉత్తర కొరియా అనేక ఏళ్ల దూరంలో ఉందని నిపుణులు అంటున్నా రు. అణుబాంబును చిన్నరూపంలోకి మార్చే టెక్నాలజీ ఆ దేశానికి ఉండే అవకాశం లేదంటున్నారు. హైడ్రోజన్ బాంబు అయినా కాకపోయినా అది ఉత్తర కొరియాకు నాలుగవ అణు పాటవ పరీక్ష. ధిక్కార ధోరణిలో తాజా ప రీక్ష సాగింది. అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోకుండా ముందుకు సాగుతున్నందుకు గట్టి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మిత్రదేశాలు, శత్రుదేశాలు హెచ్చరిస్తున్నాయి. 2006, 2009, 2013లో ఉత్తర కొరియా అణుపరీక్షలు జరిపింది. ఫలితంగా అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించిం ది. మరింత కఠినంగా, కాలనియమంతో చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యస మితి భద్రతా మండలిపై ప్రస్తుతం నాలుగో పరీక్షతో ఒత్తిడి పెరగడం ఖా యం. 2013లో జరిపిన అణుపరీక్ష తరువాత ఉత్తర కొరియా 2007లో మూసివేసిన ప్లుటోనియమ్ రియాక్టర్ పనిని తిరిగి ప్రారంభించింది. ఏడాదికి ఆరు కిలో గ్రాముల (13పౌండ్ల) ప్లుటోనియం ఉత్పత్తి సామర్ధం కలది. ఒక అణు బాంబు తయారీకి అది సరిపోతుంది. ప్రస్తుతం ఆరు అణుబాంబులకు సరిపోయే ప్లుటోనియం ఉత్తర కొరియా వద్ద ఉందని భావిస్తున్నారు. పొరు గున ఉన్న దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి ఉత్తర కొరియా తాజా పరీక్షను గట్టిగా ఖండించింది.
ఈ కవ్వింపుపై తగిన చర్యకు అమెరికా హెచ్చరిక
ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు తగిన గుణ పాఠం చెబుతామని అమెరి కా బుధవారం నాడు ప్రతిజ్ఞగైకొంది. హైడ్రోజన్ బాంబు పరీక్షను విజయవం తంగా జరిపామని ఆదేశం ప్రకటించాక అమెరికా ఈ విధంగా స్పందించిం ది. ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాల రక్షణ కొనసాగిస్తామని, ఉత్తర కొరి యా కవ్వింపు చర్యలకు తగిన విధమైన ప్రతిచర్య తీసుకొంటామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. అదే సమయంలో ఉత్తర కొరి యా తాజా ప్రకటనపై ఎటువంటి నిర్ధారణకు రాలేదన్నారు. అయినప్పటికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడాన్ని ఉపేక్షించ బోమని అమెరికా స్పష్టం చేసింది. ఆ దేశ అణుపరీక్షల కేంద్రవద్ద ప్రకంపన లను గుర్తించామని, తరువాత అణుపరీక్షల గురించి ఆదేశం ప్రకటనను చూశామని కెర్బీ పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోని తమ భాగస్వామ్య దేశాలతో కలిసి పరిస్థితిని గమనిస్తున్నామ ఆయన తెలిపారు.
రాయబారిని పిలిపించి చైనా నిరసన?
ఉతర కొరియా జరిపిన అణు పరీక్షను చైనా ఖండించింది. ఉత్తర కొరియా తొలి హైడ్రోజన్ బాంబు పరీక్షను తాము తీవ్రంగా వ్యతిరేకిస్త్తున్నట్లు చైనా పేర్కొంది. ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలను తాము గౌరవిస్తామని తెలి పింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి నడుస్తామని పేర్కొం ది. ఈ పరీక్షపై దౌత్యపరంగా నిరసన తెలుపడానికి ఉత్తర కొరియా రాయ బారిని పిలిపించాలని అనుకొంటున్నట్టు చైనా వివరించింది.