Friday, March 29, 2024

అతిపెద్ద క్షిపణి పరీక్ష నిర్వహించిన ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

North Korea conducts largest missile test

 

పోంగ్యాంగ్: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల విషయంలో తగ్గేదే లేదని మరోమారు నిరూపించింది. ఈ ఉదయం జపాన్ సముద్రం వైపుగా బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించింది. ఈ నెలలో ఇది ఏడో క్షిపణి పరీక్ష కావడం గమనార్హం. దీర్షకాలంగా నిలిచిపోయిన అణుచర్చల విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. దేశంలోని ఉత్తర అంతర్గత ప్రాంతం నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్టు అనుమానిస్తున్నారు. అయితే, దీని రేంజ్ వివరాలు తెలియరాలేదు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం 7.52 గంటలకు ఈ పరీక్ష జరిగినట్టు దక్షిణ కొరియా పేర్కొంది.

ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి (ఐఆర్‌బిఎం) అయి ఉంటుందని, నవంబరు 2017 తర్వాత జరిపిన పరీక్షల్లో అతి పెద్దది ఇదేనని వివరించింది. జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఇది బాలిస్టిక్ క్షిపణే అయి ఉంటుందని చెబుతున్నాయి. అయితే, ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. ఉత్తర కొరియా గురువారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత రెండు రోజులకే మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షను నిర్వహించడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News