Home జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం

మేడిగడ్డతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం

నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు
ఆంధ్రా గుత్తేదార్లను పెంచి పోషించింది కాంగ్రెస్సే
మంథని ఎంఎల్‌ఎ పుట్ట

టీఆర్‌ఎస్ జెండావిష్కరణ
కాటారం: మండలంలోని ధన్‌వాడ గ్రామంలో బస్టాండ్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ జెండాను మంథని శాసన సభ్యులు పుట్ట మధూకర్ బుదవారం ఉదయం ఆవిష్కరిచారు. గతంలో ఉన్న పార్టీ గద్దెను కొందరు వ్యక్తులు రాత్రకి రాత్రి కూల్చివేయడంతో మళ్లీ కాటారం సింగిల్ విండో చైర్మెన్ తుల్సెగారి శంకరయ్య ఆధ్వర్యంలో నూతనంగా గద్దెను నిర్మించారు. కాగా బుదవారం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాటారం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట జనార్ధన్, నాయిని శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాసరావు, కుంభం రమేష్‌రెడ్డి, బొమ్మ పోచిరెడ్డి, చల్లా వెంకన్న, జక్కిరెడ్డి, లచ్చిరెడ్డి, గట్టు రమేష్, బన్సీలాల్, బొడ్డు రాజబాపు, మురళి, అనంతుల రమేష్, శ్రీనివాస్,ప్రకాష్, సడువళి, భూపెల్లి రాజు, తుల్సెగారి దేవెందర్, కాయిత విఠల్‌తో పాటు తదితరులు ఉన్నారు.

Medigaddaకాటారం:  కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని బయటపెట్టుకుంటూ మళ్లీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని రైతులు, ప్రజలను 60 సంవత్సరాలుగా కాంగ్రేస్ పార్టీ ప్రజలను మోసం చేసింది తప్పా ప్రజలకు ఒకగబెట్టింది ఏమీ లేదని, రీడిజైనింగ్ పేరుతో మేడిగడ్డ ప్రాజెక్టుతో ఖజానాకు తూట్లు అంటున్న కాంగ్రేస్ నేతలకు మంథని శాసన సభ్యులు పుట్ట మధూకర్ తనదైన శైలిలో కాంగ్రేస్ పార్టీకి చురకలంటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వార  ఖజనాకు నిలువెత్తు సాక్షమే రోడ్డు ప్రక్కన చిందర వందరగా పడి ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పైపులు అని ఎమ్మెల్యే అన్నారు. బుధవారం ఉదయం మండలకేంద్రంలోని మెగా కంపెనీ వద్ద ఏళ్ల తరబడి రోడ్డు మీద పడి ఉంటున్న కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పైపుల వద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం కాంగ్రేస్ పార్టీ మహాదేవపూర్‌లో మేడిగడ్డ భూసేకరణ గురించి మరో సారి ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో దీక్ష చేపట్టడం జరిగిందని విమర్శించారు. 69 సంవత్సరాలుగా ప్రజలను చీకటిలో ఉంచిందనీ, తెలంగాణలో ఇప్పటికీ బీద ప్రజలు ఆకలితో అలమిటిస్తున్నారంటే దానికి కారణం కాంగ్రేస్ ప్రభుతమేనని అన్నారు. మంథని నియోజకర్గంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు గమనించాలన్నారు. 2013వ చట్టం ప్రకారం ప్రజలకు మేలు అంటున్న కాంగ్రేస్ ఆ చట్టం పుణ్యమే ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు కాకుండా భూములకు పరిహారం విషయంలో రైతులకు పూర్తిగా పరిష్కారం చేయకుండా భూములు తీసుకోని పరిస్థిలలో మీరు డబ్బులు దండుకొని జేబులు నింపుకొని పైపులు రోడ్డుమీద పడేస్తే అవి ఆ విధంగా ఏడుస్తున్నాయో దీనికి ఇదే నిలువెత్తు సాక్షమని ఆయన పైపులను వేళెత్తి చూపించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సంబందించిన పైపులు రోడ్డపై పడేసి ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నరో ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అట్టి విషయాన్ని మరిచిన ప్రజలను గుర్తు చేసుకోవడానికి మేడిగడ్డ భూనిర్వాసితులను రెచ్చగొడుతున్నారన్నారు. మేడిగడ్డ పాజెక్టుతో ఉత్తర తెలంగాణ అంత కూడా సస్యశామలం అవుతుందని, సిరులు పండుతాయన్నారు. మంథని నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళిక, పద్దతుల తో ముందుకెళ్తుందన్నారు.  కాంగ్రేస్ పార్టీ కక్షలు, కుట్రలు, కతంత్రాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లి స్టేలు తెస్తూ మేడిగడ్డ ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రాజెక్టు నిర్మాణం ఆపి అధికారం చేజిక్కించుకుందామనే నీచరాజకీ యాలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రాజెక్టులు కనుక పూర్తి అయినట్లైతే ప్రజలు కాంగ్రేస్ నాయకులను చీదరించుకుంటారనే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే విషం కక్కుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల క్రింది భూముల కోల్పోతున్న ప్రతి ఒక్క రైతుకు చరిత్రలో లేని విధంగా సిరిపురం, ఉప్పట్ల, సుందిళ్ల, ముస్తాల గ్రామాలకు రూ.6లక్షల విలువ వస్తే రూ.8లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకి దక్కిందన్నారు.

ఎన్నడూ లేని విధంగా మూడు వంతులకుపైగా మరో వంతు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌కు  దక్కిందని తెలిపారు. మీ పరిహారాల వల్ల లక్షలాది రూపాయల విలువ గల పైపులను రోడ్ల మీద పడేశారు తప్పా, ఒక్క ఎకారనికి నీళ్లివ్వని కాంగ్రేస్ పార్టీ ఈ రోజు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తుందన్నారు. మహాదేవపూర్‌లో కాంగ్రేస్ దీక్షలో వారు మాట్లాడుతూ ఆంధ్రా గుత్తేదార్లకే కాంట్రాక్టు పనులు ఇచ్చారంటున్నరు. తెలంగాణలో కాంగ్రేస్ ప్రభుత్వం చేసిన పనులు ఆంధ్రా గుత్తాదార్లను పెంచిపోషించింది కాంగ్రేస్ పార్టేనని, ఈరోజు తెలంగాణ గుత్తేదార్లు అవగాహన కల్పించని ఘనత మీదే కదా అని, తెలంగాణ గుత్తేదార్లను లక్ష, యాభై వేలకే పరిమితం చేసిన ఘణులు మీరే కదా అని విమర్శించారు. మహాదేవపూర్‌లో మీరు మాట్లాడిన ప్రతి అంశం మీకే వర్తింస్తుందన్నారు.

వాటికి మీరే జవాబు చెప్పాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఈ పరిస్థితలలో ఉండడానికి కారణం కాంగ్రేస్ నీచ రాజకీయమన్నారు.టీఆర్‌ఎస్ పార్టీ ఏ పనైతే మొదలు పెడుతుందో ఆ పని పూర్తి చేసి ప్రజలకు ఫలాలు అందిస్తుందన్నారు. రాజకీయ బోకర్లు లేకుండా ప్రజల చెంతకు వెళుతున్నాయన్నారు. ఇప్పటికైనా కాంగ్రేస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పి మేడిగడ్డ ప్రాజెక్టుకు సహకరించాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి చేయడంకోసం కోసం నియోజవర్గ ప్రజలకు అన్ని విధాల వాస్తవాలు చెప్పాలన్నారు. ఇప్పటికే కాంగ్రేస్ పార్టీకి చెప్పానని, ఎక్కడ పరిహారం ఏ విధంగా ఎక్కువ వస్తుందో చెప్పండని మాజీ ఎమ్మెల్యేను అడుగడం జరిగిందన్నారు. ఇప్పటికు రండి  మాజీ ఎమ్మెల్యేకు చెప్పడం జరిగింది కూర్చొని మాట్లాడుకుందామని అన్నారు. ఆ విషయానికి రాకుండా ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నడనీ, కలెక్టర్, ప్రభుత్వం వద్ద వెళ్లామని మాజీ ఎమ్మెల్యేను అడిగినా ఎక్కడికీ రాకుండా ప్రజలకు అబద్దపు మాయమాటలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు. కనుక ఇప్పటికైనా గమనించాలని కోరారు.  కాంగ్రేస్ పార్టీ మైకంలోకి వెళితే ఇప్పటికే 69సంవత్సరాలు చీకటిలో మగ్గిపోయినం, ఇంకా ఆకలితో అలమటిస్తున్నాం, నీళ్లు, ఇళ్లు, రోడ్లు  లేని వారు ఈ నియోజకవర్గంలో  అత్యధికంగా ఉన్నారుగనుక ఇంకా వారి పరిపాలన కోరుకుంటే చీకటి మయంలకు పోయే ప్రమాదం ఉందని, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే నియోజకవర్గంలో వెలుగులనిస్తుందన్నారు.

పొద్దంతా కరెంటుతో పాటు పెన్షన్, కళ్యాణలక్ష్మి, రోడ్లు, నీళ్లు అనేక పథకాలతో ముందుకు వెళ్తుందన్నారు. కాంగ్రేస్ పార్టీ మాయమాటలకు లొంగకుండా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి తీరాడానికి  రైతులు, ప్రజలు సహరించడానికి ముందుకు రావాలని ఆయన విఙ్ఞప్తి చేశారు.  రైతులను టీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. మీకు  కాంగ్రేస్ పార్టీ అవసరం లేదని ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాల అదుకుంటుందని, అందలమెక్కి స్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రోడ్డుపై పడేసి ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైపుల సాక్షిగా కాంగ్రేస్ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో  కాటారం టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట జనార్ధన్, మహాముత్తారం జెడ్‌పిటిసి మందల రాజిరెడ్డి, కాటారం మార్కెట్ కమిటీ చైర్మెన్ లింగంపల్లి శ్రీనివాసరావు, సింగిల్‌విండో చైర్మెన్ తుల్సెగారి శంకరయ్య, టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, కుంభం రమేష్‌రెడ్డి, చల్లా జక్కిరెడ్డి, గంగిరెడ్డ లకా్ష్మరెడ్డి, గట్టు రమేష్, తైనేని సతీష్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పంతకాని సడువళి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అనంతుల రమేష్‌బాబు, అజ్మీరా బన్సీలాల్,అనంతుల  శ్రీనివాస్, పడకంటి ప్రకాష్‌తో పాటు తదితరులు ఉన్నారు.