Home తాజా వార్తలు గంజాయి అంతరాష్ట్ర ముఠా అరెస్టు

గంజాయి అంతరాష్ట్ర ముఠా అరెస్టు

marijuana-gang

రూ.6.70లక్షల విలువైన 96కిలోల గంజాయి స్వాధీనం
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.6,70,000 విలువైన 96కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని విశాఖపట్టణం, గూడెం కొత్త వీధి మండలానికి చెందిన కయ్యం నాగరాజు, పీరి చిన్నారావు గంజాయి విక్రయిస్తున్నారు. వారికి సాయంగా మార్ఘల్ దుర్గా బాబు, గొల్లోరి నర్సింహ ఉన్నారు. నాగరాజు, పేరి చిన్నారావు ఇద్దరు కలిసి గంజాయి మొక్కలను ఒరిస్సాలోని అటవీ ప్రాంతంలో పెంచుతున్నారు.

దుర్గాబాబు, నర్సింహతో కలిసి శివశంకర్ రెడ్డికి విక్రయిస్తున్నారు. గంజాయిని ప్యాకెట్లలో నింధ్ప సప్లయ్ చేసేందుకు నగరానికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. కిలో గ్రాముకు రూ.1,500 చోప్పున విక్రయిస్తున్నారు. దానిని శివశంకర్ రెడ్డి రూ.7,000 చొప్పున అమ్ముతున్నాడు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై కెవి సుబ్బారావు, రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్,శ్రీకాంత్ తదితరులు నిందితులను పట్టుకున్నారు.

North Zone Task Force has arrested marijuana gang