Friday, March 29, 2024

స్నేహితుల ఇళ్లే టార్గెట్

- Advertisement -
- Advertisement -

North Zone Task Force police have arrested man accused of burglary

ఫంక్షన్లకు వెళ్లిన వారి ఇంట్లో చోరీలు
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లల్లో చోరీలు చేస్తున్న నిందితుడిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.1లక్ష నగదు, 114 గ్రాముల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్, బేగంపేటకు చెందిన మహ్మద్ సోయబ్ అలియాస్ ఇలియాస్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు వ్యాపారంలో వస్తున్న డబ్బులు సరిపోవడంలేదు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి తను ఇంటి చుట్టుపక్కల వారు, స్నేహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నాడు.

వారు ఫంక్షన్లకు వెళ్లినది తెలుసుకుని వారి ఇళ్లల్లో చోరీలు చేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి తన స్నేహితుడి తల్లిదండ్రులు బందువుల ఫంక్షన్‌కు వెళ్లిన విషయం తెలుసుకుని బేగంపేట, ప్రకాష్ నగర్ ఎక్స్‌టెన్షన్, ఆరకం మజీద్ సమీపంలోని ఇంటి వెనుక నుంచి వెళ్లి ఆల్మారాలోని లక్ష రూపాయలు, బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. వాటిని తీసుకుని వెళ్లి తన ఇంట్లోని రహస్య ప్రాంతంలో దాచిపెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బేగంపేట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, అశోక్ రెడ్డి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News