Home జాతీయ వార్తలు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : సంజయ్ దత్

ఎన్నికల్లో పోటీ చేయడం లేదు : సంజయ్ దత్

Sanjay Duttముంబయి : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పష్టం చేశారు. సంజయ్ దత్ ఘజియాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సంజయ్ దత్ కొట్టిపారేశారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ నుంచి పలు మార్లు ఎంపిగా పని చేశారు. తండ్రి అడుగుజాడల్లోనే సంజయ్ సాగుతారని కొంతకాలంగా వార్తలు రాగా, వాటిని ఆయన కొట్టి పారేశారు. అయితే ఈ ఎన్నికల్లో  పోటీ చేస్తున్న తన సోదరి, కాంగ్రెస్ ఎంపి ప్రియాదత్ కు తాను పూర్తి మద్దతు ఇస్తానని ఆయన ట్వీట్ చేశారు.  దేశ ప్రజల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Not Contesting in Lok Sabha Elections : Sanjay Dutt