Home ఆంధ్రప్రదేశ్ వార్తలు టిటిడి ఉద్యోగులకు కొత్త సమస్య

టిటిడి ఉద్యోగులకు కొత్త సమస్య

Not Covid-19 Tests to TTD Employees

 

తిరుమల: తిరుమల కొండపై విధులు నిర్వర్తిస్తున్న టీటీడీ ఉద్యోగులు, భద్రతా సిబ్బందితో పాటు పలువురు అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్ చేశారు. క్వారంటైన్ ముగిసిన అనంతరం వారు విధుల్లో చేరారు. దీంతో ఇతర సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. కరోనాతో క్వారంటైన్ ముగిసిన వారికి ఎటువంటి కరోనా పరీక్షలు చేయకుండానే విధుల్లోకి తీసుకోవడంపై ఇతర సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వారిని విధుల్లోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా సోకి కోలుకున్న వారికి మళ్లీ పరీక్షలు చేసి విధుల్లోకి తీసుకోవాలని ఇతర సిబ్బంది టిటిడి అధికారులను కోరుతున్నారు.

 Not Covid-19 Tests to TTD Employees