Wednesday, March 22, 2023

మా కోసం కాదు… మాపాలన కోసం

- Advertisement -

mantri

*ప్రగతి కాంక్షించి పార్టీలో
చేరుతున్నారు
*అందరినీ కలుపుకుపోతాం
*ప్రజా సంక్షేమమే లక్షంగా
పనిచేస్తాం
*రాష్ట్ర వ్యవసాయ శాఖ
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన నచ్చి ఇతర పార్టీలో నుండి భారీగా తరలివస్తున్నారని, వస్తున్నదీ మా కోసం కాదని, మా పాలనను  నచ్చి మాత్రమే వస్తు న్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సు వాడలో కాంగ్రెస్ పార్టీలో నుండి టిఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గురు వినయ్, విద్యాసాగర్, పంతుల రాములను కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు,  ప్రజా శ్రేయస్సును కాంక్షించి మంచి పాలన గా గుర్తించడం హర్షనీయమన్నారు. ఏళ్ల కాల ంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నాయ కులు పార్టీలోకి చేరడం సంతోషదాయకమని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికి మంచి గుర్తింపు ఉంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులకు మంచి భవిష్యత్తును అందించేం దుకు సీఎం కెసిఆర్ యోచనలో ఉన్నారని చెప్పారు. అందరితో కలిసి పార్టీ పటిష్టతకు పాటుపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ నాయకులు పోచారం  సురేందర్ రెడ్డి, పోచారం బాస్కర్ రెడ్డి, అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాజ్, నార్ల సురేష్, బద్యానా యక్, మోహన్ నాయక్, దాసరి శ్రీనివాస్, బాబా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News