Home లైఫ్ స్టైల్ ఎదుగుదల మెరుగే… బరువే పెరగాలి

ఎదుగుదల మెరుగే… బరువే పెరగాలి

Children-Food

మనదేశంలో పేదల కుటుంబాల్లో పిల్లలు ఐదేళ్ల వయసులోపు మరణించే సంఖ్య అధికం. దానికి వివిధ కారణాలున్నప్పటికీ పోషకాహార లోపమే పెద్ద కారణం. ఐదేళ్ల లోపు వయసులో వారికి మంచి పోషణ జరగాలి. అలా జరగకపోతే వారి శారీరక అభివృద్ధి కుంటుపడుతుంది. పిల్లలకు పోషకాహారం అందించడానికి ప్రభుత్వం అంగన్‌వాడీ పథకాలు ప్రయత్నిస్తున్నా పరిస్థితిలో చాలా గొప్ప మార్పులు లేవని 2015-16 మధ్యలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. పిల్లల పోషకాహారానికి సంబంధించి విషయాలను తెలుపుతోంది. ఆ సర్వే ప్రకారం ఐదేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలనుబట్టి వారి వయసుకి తగిన ఎత్తు పెరిగారు. కాని ఉండాల్సినంత బరువు మాత్రం లేరు. పోయిన ఏడాది జరిగిన సర్వే లాటి భారీ ఎత్తున సర్వే 2005-06 లో జరిగింది. అప్పటి సర్వేలో 48 శాతం మంది పిల్లలు వయసుకి తగిన ఎత్తు పెరగట్లేదని తేలింది. కాని సరికొత్త సర్వే ప్రకారం ఆ శాతం 38.4 కి తగ్గింది. అంటే ఇప్పుడు పిల్లలు ఎత్తుకి తగిన పొడవు ఎదుగుతున్నారు. సాధారణంగా వయసుకి తగిన ఎత్తు పెరగకపోవడానికి కారణాలు సరైన ఆహారం తీసుకోకపోవడం. తరచు ఆకలిగా ఉండటం. చాలా ఎక్కువసేపటి వరకు ఆహారం తీసుకోకపోవడం.

2005-06 లెక్కల ప్రకారం దాదాపు 20 శాతం మంది పిల్లలు వయసుకి ఎత్తుకి తగిన బరువు పెరగలేదు. 6 శాతం మంది పూర్తిగా కుపోషణలో ఉండి ఎదుగుదల ఆగిపోయి ఉన్నారు. అయితే 2015-16 లెక్కల ప్రకారం వయసుకి, ఎత్తుకి తగిన బరువు పెరగని వారు 21 శాతానికి పెరిగారు. 7.5 శాతం మంది అత్యంత బలహీనంగా ఉన్నారు.

వయసుకి తగిన ఎత్తు బరువు పెరగకపోవడాన్ని వేస్టింగ్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఐదేళ్ల వయసు లోపు పిల్లల మరణాలను వేస్టింగ్ ద్వారానే కొలుస్తారు. అత్యంత కుపోషణకు లోనైన పిల్లలు మరణించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సర్వే ఫలితాలు అంతకుముందుతో పోలిస్తే కొద్ది మెరుగ్గానే ఉన్నాయి. పిల్లల్లో పెరుగుదలలో మెరుగుదల కన్పించడం అంటే మంచి పరిణామమే. పిల్లల ఆరోగ్య పరిస్థితిలో అభివృద్ది కనిపిస్తున్నట్లే. సాధారణంగా సరైన పోషకాహారం దొరకకపోతే పిల్లలు ముందుగా ఎత్తు పెరగడం ఆగిపోతారు. ఆ పరిస్థితి కొనసాగుతూపోయి మరింత పోషకాహార లోపానికి గురయ్యారంటే బరువు తగ్గిపోవడం ఆరంభం అవుతుంది. మళ్లీ కొద్దిగా మంచి ఆహారం తినడం మొదలైతే పిల్లలు మళ్లీ ఎత్తు పెరగడం మొదలవుతుంది. అప్పుడే బరువు కూడా పెరుగుతారు. ఆ పరిస్థితే ఆరోగ్య సర్వేలో ప్రతిఫలిస్తోంది. పిల్లలకు అంతకు ముందు కన్నా మెరుగ్గా ఆహారం అందుతున్నట్లే.

పిల్లలు పుట్టిన రెండు సంవత్సరాల వరకు మంచి తిండి పెడితే సన్నగా ఉన్నా వయసుకి తగిన ఎత్తు పెరుగుతారు. అయితే పిల్లలకు తగినంత ఆహారం పెట్టడంతో పాటు అన్ని రకాల పోషకాలు వెళ్తున్నాయా లేదా చూసుకోవడం కూడా అవసరమే. గోధుమ, అన్నం, పాలు, గుడ్లు, పండ్లు, నట్స్, కూరగాయలు పెట్టాలి. ప్రభుత్వం, అదనపు ఆహార కార్యక్రమం కింద పిల్లల సమగ్ర అభివృద్ధి పథకం కింద పిల్లలకు అవసర మైనంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోంది. అయి తే పొట్లాల ఆహారం పిల్లలు తినడానికి ఇష్టపడరు. అక్కడి స్థానిక వంటకాల రుచికి అలవాటు పడి ఉంటారు కాబట్టి అదే ఇష్టపడతారు. ఆ విధంగా ప్రభుత్వం ప్రణాళిక ఉండాలని ఆరోగ్య కార్యకర్త ఒకరు అభిప్రాయ పడుతున్నారు.

Odiity-Genn

పదేళ్ల కింద టి సంఖ్యతో పోల్చుకుంటే పెరుగుదల ఆగిపోయిన పిల్లల సంఖ్య ఇప్పుడు తక్కువగానే ఉన్నా ఇంకా అటువంటి పిల్లలున్నారు.
శ్రీలంకలో ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల్లో కుపోషణకు లోనైన వారు 15 శాతం మాత్రమే. అంటే మన కన్నా సగం కన్నా తక్కువమంది అటువంటి పిల్లలున్నారు.
దేశంలో పిల్లల ఆరోగ్య పరిస్థితిలో మరింత మెరుగుదల జర గాల్సి ఉంది. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల సంఖ్య తగ్గించ డాని కి గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టినా ఫలితంలో అనుకున్నంత మెరుగుదల మాత్రం కనిపించలేదు. మరింతగా ఆదిశగా కృషి జరగాల్సి ఉంది.