Home తాజా వార్తలు న్యూ మదీనా జూనియర్ కాలేజీకి గుర్తింపు లేదు

న్యూ మదీనా జూనియర్ కాలేజీకి గుర్తింపు లేదు

Not identification to new madina junior college in tolichowki

 

ఇంటర్మీడియట్ బోర్డ్

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో నిర్వహిస్తున్న న్యూ మదీనా జూనియర్ కాలేజీ (కోడ్: 60237)కి 2021/20-22 విద్యా సంత్సరానికి అనుబంధ గుర్తింపు మంజూరు చేయలేదని రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఉన్నతాధికారి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోరుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు ఇది గుర్తించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో హైదరాబాద్ టోలిచౌకి, న్యూ మదీనా జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకోవద్దని తెలిపారు. ఈ కాలేజీ గత సంవత్సరం జరిగిన కొన్ని చట్టవిరుద్ధమైన చర్యలపై గోల్కొండ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని, ఈక్రమంలో కేసు కూడా నమోదైందని తెలిపారు.

Not identification to new madina junior college