Home తాజా వార్తలు సిఎం పదవీపై ఆసక్తి లేదు: కెటిఆర్

సిఎం పదవీపై ఆసక్తి లేదు: కెటిఆర్

Not Interested on CM Post say Minister KTR

హైదరాబాద్: ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… అధికారం లేక కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. నోట్లరద్దు లేకపోతే రాష్ట్ర ఆదాయం ఇంకా పెరిగేదని చెప్పారు. బ్యాంకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇటీవల రైతులకు ఇచ్చిన కొత్త పట్టాదారు పాస్‌బుక్స్‌లోని చిన్నచిన్న పొరబాట్లను సవరిస్తామన్నారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం ఇవ్వలేమని స్పష్టం చేశారు. 54 ఎకరాలుంటే సీలింగ్ యాక్ట్ ఉందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 100కు పైగా స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే మంత్రి హరీష్‌రావుకు తనకు ఎలాంటి పోటీ లేదన్నారు. అంతేగాక ముఖ్యమంత్రి పదవీపై కూడా తనకు ఆసక్తి లేదని తెలిపారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో సిఎం కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని ఈ సందర్భంగా కెటిఆర్ జోస్యం చెప్పారు.