Home తాజా వార్తలు వ్యభిచార గృహంపై పొలీసుల దాడి….

వ్యభిచార గృహంపై పొలీసుల దాడి….

NOT Police Attack on Adultery House

 

బాలాపూర్: నివాస గృహాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్‌ఒటి పొలీసులు దాడి చేసి నిర్వహకురాలితో పాటు మరో యువతి, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మీర్‌పేట్ మున్సిపాలిటి పరిధిలోని నందిహిల్స్ కాలనీలో వీరమల్ల బాల కనక మహాలక్ష్మి గత కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎల్‌బినగర్ ఎస్‌ఒటి పొలీసులు సదరు గృహంపై దాడి చేసి నిర్వహకురాలతోపాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాబిన్ ఖాతూన్(25) అనే యువతిని, ధన్‌రాజ్‌గౌడ్(48), వర్ధేశ్వర్‌గౌడ్(41)అనే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1160 నగదు, మూడు కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఒటి పొలీసులు వీరిని మీర్‌పేట్ పొలీసులకు అప్పగించారు.

NOT Police Attack on Adultery House in Meerpet