Saturday, April 20, 2024

వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రించ‌లేదు: టిటిడి

- Advertisement -
- Advertisement -

Not resume special darshan for Physically disabled: TTD

తిరుమల: వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు స్వామివారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను పున‌రుద్ధ‌రించలేదని టిటిడి స్పష్టం చేసింది. గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో టిటిడి అధికారులు స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో అవాస్త‌వ స‌మాచారం జరుగుతోందని, ఇది నిజ‌మ‌ని న‌మ్మి అనేకమంది తిరుపతికి వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉండడంతో ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి అధికారులు భ‌క్తులకు విజ్ఞ‌ప్తి చేశారు. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుందని పేర్కొంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరింది.

కాగా, కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో గతేడాది మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోంది.

Not resume special darshan for Physically disabled: TTD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News