Home జాతీయ వార్తలు కాంగ్రెస్‌కు 300 సీట్లు రావడం డౌటే : గులాం నబీ అజాద్

కాంగ్రెస్‌కు 300 సీట్లు రావడం డౌటే : గులాం నబీ అజాద్

Not sure if congress can get 300 seats in 2024

 

న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 300 స్థానాలు లభించే అవకాశం తనకు కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ సందేహం వెలిబుచ్చారు. జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లా కృష్ణఘాట్ ఏరియాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికరణ 370 రద్దుపై మౌనం దాల్చడంపై మాట్లాడుతూ దీనిని కేవలం సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని వివరించారు. తమ పార్టీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 300 మంది ఎంపీలు కావాలని, అంతమంది వచ్చేదెపుడు? అందువల్ల తానేమీ అధికరణ పునరుద్ధరణ గురించి వాగ్దానం ఇవ్వలేనన్నారు.

Can’t see congress securing 300 seats in 2024 Lok Sabha polls