Friday, April 19, 2024

త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for replacement of 177 clerical posts in Singareni soon

ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్ష
ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు
సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్.బలరాం

మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సంస్థలో త్వరలో 177 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో వెలువడనుందని ఆ సంస్థ డైరెక్టర్ (పా) ఎన్.బలరాం వెల్లడించారు. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్షను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దని సింగరేణిలో ఉద్యోగాల భర్తీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బలరాం పలు విషయాలపై మాట్లాడారు.

గతేడాది సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను ఈ నెల 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందని ఆయన తెలిపారు. లాభాల్లో కార్మికుల వాటా విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. తమ నుంచి బొగ్గు కొనుగోలు చేసిన వారు వారంలోగా బకాయిలను చెల్లించకుంటే ఏడున్నర శాతం వడ్డీ విధిస్తామంటూ ఆయన స్పష్టంచేశారు. ఈ రూపంలో సంస్థకు ఏటా రూ.100 కోట్లు అదనంగా లభిస్తుందని బలరాం వెల్లడించారు. అయితే సింగరేణిలో క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనంతరం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుందని, పరీక్ష తేదీని కూడా సింగరేణి సంస్థ వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News