Home తాజా వార్తలు ఐదు ఎంఎల్‌సి స్థానాల కోసం నోటిఫికేషన్

ఐదు ఎంఎల్‌సి స్థానాల కోసం నోటిఫికేషన్

MLC Electionsహైదరాబాద్‌: శాసనసభ కోటా ఎంఎల్‌సి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం ఐదు స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి. గురువారం  నుంచి ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. గురువారం నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 1వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. శాసన సభ కోటాలో ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, సంతోష్‌ కుమార్‌, మహ్మద్‌ సలీం, మహమూద్‌ అలీ పదవీకాలం పూర్తికానుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదు స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార టిఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది. అధికార టిఆర్ఎస్ కు అసెంబ్లీలో 90  మంది ఎంఎల్ఎలు ఉన్నారు. టిఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 స్థానాలు ఉన్నాయి. దీంతో ఎంఎల్ఎ కోటా కింద వచ్చే 5 ఎంఎల్ సి స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Notification Issued for 5 MLC Posts