Thursday, July 17, 2025

జనగణనపై నేడు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

ఏర్పాట్లపై అమిత్ షా సమీక్ష

న్యూఢిల్లీ : దేశంలో జరిగే జనాభా లెక్కల ప్రక్రియ సంబంధిత నోటిఫికేషన్ సోమవారం (నేడు) వెలువడనుంది. ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా జనగణన ప్రక్రియ ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు. అత్యంత విస్తృత స్థాయిలో జరగాల్సి ఉన్న 16వ సెన్సస్ ప్రక్రియకు ఈసారి కులాల వారి జనగణన కూడా తోడు కానుంది. ఈ కార్యక్రమం 2027లో ఆరంభం అవుతుంది. రెండు దశల్లో పూర్తి కావాలని నిర్ణయించారు. జనగణన కార్యక్రమ ఏర్పాట్లను అమిత్ షా కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఇతర సీనియర్ అధికారుల సమావేశంలో అడిగి తెలుసుకున్నారు.

అమిత్ షాకు సంబంధిత ప్రక్రియ ఏర్పాట్ల గురించి హోం శాఖ కార్యదర్శితో పాటు జనాభా లెక్కల సంబంధిత కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ , ఇతర సీనియర్ అధికారులు వివరించారు. అవసరం అయిన సిబ్బంది, జనగణనలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఈ భేటీలో సమీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనాభా లెక్కల ప్రకియకు దేశవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మంది వరకూ జనాభా లెక్కల సేకర్తలు , పూపర్‌వైజర్లు, వీరికి తోడుగా దాదాపు 1.3 లక్షల మంది వరకూ సెన్సస్ నిర్వాహకులు అందుబాటులో ఉంటారు. జనాభా లెక్కల ప్రక్రియ ఆరంభం తరువాత భారత్‌లో జరిగే 16వ సెన్సస్ ఇదే. ఇక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతి క్రమంలో ఇది 8వ జనాభా లెక్కల సేకరణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News