Home తాజా వార్తలు నేడే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

నేడే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

liquorహైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల నిర్వహణకు బుధవారం టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు(ఆదివారం మినహా) కొత్త మద్యం దుకాణాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటల నుంచి జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి దుకాణాలను కేటాయిస్తారు. దరఖాస్తుదారులు నాన్ రిఫండబుల్ ఫీజు కింద డిడి రూపంలో రూ.2 లక్షలు చెల్లించాలి. అక్టోబర్ 30లోపు కొత్త మద్యం దుకాణాల యజమానులకు లైసెన్స్‌లు అందజేసి నూతన మద్యం విధానాన్ని, నవంబర్ ఒకటో నుంచి అమల్లోకి రానుంది.

Notification Today for Liquor Stores in Telangana