Saturday, February 4, 2023

ఉపాధి సిబ్బందిపై ‘సస్పెన్షన్’ వేటు..!

  • సామాజిక తనిఖీలో బయటపడిన అవినీతి, అక్రమాలు
  • అడవిసోమనపెల్లిలో రోడ్డు వేయకుండానే బిల్లులు స్వాహ
  • ఎపిఓ, ఇసి, టిఎతో పాటు ఇద్దరు ఫిల్టు అసిస్టెంట్ల సస్పెన్షన్
  • మండల వ్యాప్తంగా రూ. 3, 63,843 రీకవరికి పిడి ఆదేశం
- Advertisement -

Officers-Suspended

మంథని : పేద కూలీలకు స్థానికంగా ఉపాధి చూపించి, వారు వలస బాట పట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వాలు గత కొన్ని సంవత్సరాలుగా మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఆమలు చేస్తుండగా కొంత మంది క్రింది స్ధాయి ఉపాధి సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండంతో ప్రభుత్వ లక్షం ఆశించిన స్థాయిలో నేరవేరడం లేదు. ఇందుకు నిదర్శనమే.. మంథని మండలంలో ఇటీవల చేపట్టిన ఉపాధి హమీ పనుల్లో అవినీతి, అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడటమని చెప్పవచ్చు. అడవి సోమనపెల్లి గ్రామంలో గ్రావెల్ రోడ్డు పనులు చేయకుండానే బీనామీ కూలీలను పేర్లతో లెబర్ పెమెంట్ క్రింద రూ. 31 వేలు కాజేయడం, ట్రాక్టర్లతో మొరం పోసినట్లు రికార్డులు సృష్టించి ఆ గ్రామ సర్పంచ్ భర్త ఖాతాలో రూ. 82 వేలు జమ చేయడంతో పాటు ఎపిఓ, టిసి, టిఎలు రూ. 81 వేలు ప్రజాధనాన్ని స్వాహ చేసినట్లు సామాజిక తనిఖిలో బహిర్గతమైందని, ఈ మొత్తాన్ని సదురు వ్యక్తుల నుంచి రీకవరికి ఆదేశించడంతో పాటు దీనికి బాధ్యులైన ఎపిఓ దయామణి, ఇసి అయూబ్‌ఖాన్, టిఎ నవ్య, క్షేత్ర సహయకుడు గణేష్‌లను సస్పెండ్ చేస్తున్నట్లు డ్వామా, డిఆర్‌డిఎ పెద్దపల్లి పిడి కందుకూరి అంజయ్య విలేకరులకు తెలిపారు. మంథని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉపాధి హమీ తొమ్మిదో విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను వైస్ ఎంపిపి వెల్పుల గట్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. మల్లారంలో కల్వర్టులు కట్టకుండానే పైపుల బిల్లులు రూ. 68,734 స్వాహ చేశారని, ఇసి అయూబ్‌ఖాన్, టిఎ నవ్యల నుంచి ఈ మొత్తం డబ్బులను రీకవరీ చేయాలని పిడి ఆదేశించారు. అలాగే మంథనిలో బినామీ పేర్లతో పాటు, కోలతల్లో తేడాలతో టిఎ సారమ్మ, ఎఫ్‌ఎ రాకేష్‌లు అక్రమాలకు పాల్పడినట్లు సామాజిక తనిఖీలో వెలుగులోకి రాగా ఎఫ్‌ఎ వొడ్నాల రాకేష్‌ను సస్పెండ్ చేయడంతో పాటు టిఎ, ఎఫ్‌ఎలకు రూ. 41 వేలు రికవరీకి పిడి ఆదేశించారు. కాన్‌సాయిపేటలో మొక్కల పెంపకం క్రింద ఓ రైతుకు మొక్కలు మంజూరు అయితే మరో రైతు పోలంలో మొక్కలు నాటించడంతో పాటు మంజూరైన రైతు పేరిట నిర్వహణ ఖర్చుల క్రింద రూ. 12,651 అక్రమాలు చేసినట్లు గుర్తించి, బాధ్యులైన ఎప్‌ఎ, టిఎల నుంచి పిడి రికవరీకి ఆదేశించారు. కాకర్లపల్లిలో బినామీ పేర్లతో టిఎ, ఎఫ్‌ఎ రూ. 5,300లు అక్రమాలకు పాల్పడగా, రీకవరికి ఆదేశించారు. వారం రోజుల పాటు క్షేత్ర స్థాయిలో చేపట్టిన ఈ ఉపాధి హమీ సామాజిక తనిఖీలో నిబంధనలకు విరుద్దంగా చనిపోయిన కూలీల పేర్లు, వివాహలు అయ్యి వెళ్లిపోయిన వారి పేర్లు, విఆర్‌ఎల పేర్లు, అంగన్‌వాడీ ఆయాల పేర్లు, ఉపాధి కూలీల పేర్లను ఇజిఎస్ సిబ్బంది మస్టర్లలోకి చేర్చడంతో పాటు కోలతల్లో తేడా, బీనామీ పనులు, మస్టర్లలో హజర్లను దిద్దడం, వైట్ నర్ వాడటంను గుర్తించినట్లు ఎస్‌ఆర్‌పి సురేష్ తెలిపారు.

గ్రామాల వారీగా రీకవరికి పిడి ఆదేశించిన వివరాలు :

రచ్చపల్లి, అక్కపల్లి, ఖానాపూర్, నాగెపల్లి గ్రామాల్లో ఏటువంటి అక్రమాలు బయటపడలేదు. మిగిలిన గ్రామాల వారీగా పిడి రీకవరీకి ఆదేశించిన అక్రమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంథనిలో రూ. 4119, ఖాన్‌సాబ్‌పేటలో రూ. 12651, మల్లారంలో రూ. 68374, గుమ్నూర్‌లో రూ. 1500, ఎక్లాస్‌పూర్‌లో రూ. 1810, మైదుపల్లిలో రూ. 1000, లక్కెపురంలో రూ. 1000, పోతారంలో రూ. 1300, పుట్టపాకలో రూ. 2622, గద్దలపల్లిలో రూ. 1600, కన్నాలలో రూ. 1500, గోపాల్‌పూర్‌లో రూ. 1590, గుంజపడుగులో రూ. 1000, సిరిపురంలో రూ. 2534, నాగారంలో రూ. 1851, వెంకటాపూర్‌లో రూ. 607, విలోచవరంలో రూ. 2740, ఉప్పట్లలో రూ. 500 మొత్తం కలిపి రూ. 3,63,843లు అక్రమాలు జరిగినట్లు గుర్తించి, రీకవరికి పిడి అంజయ్య ఆదేశించారు. ఈ ప్రజావేదికలో టిడబ్లూఓ గంప సత్యనారాయణ, ఎంపిడిఓ జయరావు, ఎపిడి భవనరుషి, ఆడిట్ మేనేజర్ రమేష్, ఐకెపి ఎపిఎం సంతోషం పద్మ, ఎస్‌ఆర్‌పి సురేష్‌తో పాటు డిఆర్‌పిలు, విఆర్‌పిలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles